పెట్రోల్ కొట్టిస్తున్నారా... ఈ విషయం గుర్తించుకోండి ?
తమ తమ వాహనాల్లో పెట్రోల్ నింపుకోవడానికి అని పెట్రోల్ బంక్ కి వెళితే తమకు మోసం జరుగుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.
అయితే పెట్రోల్ బంక్ కు వెళ్ళినపుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన ఆ ముఖ్యమైన విషయాలు ఏమిటో ఇపుడు చూద్దాం.
* పెట్రోల్ నింపడానికి క్యాప్ ఓపెన్ చేశారా బండిని, దిక్కులను తరవాత చూడొచ్చు. ముందుగా మీటర్ జీరో కి సెట్ అయి ఉందో లేదో గమనించుకోండి, లేదంటే బురిడీ కొట్టించేయగలరు అంటున్నారు కొందరు అనుభవజ్ఞులు. ఒకవేళ మీటర్ జీరోకి రాకముందే కాస్తో కూస్తో పెట్రోల్ నింపి డబ్బులు మాత్రం ఫుల్ గా తీసేసుకోగలరు.
* రౌండ్ ఫిగర్ కొట్టిస్తే ఒక పనై పోతుంది కదా అనుకుని రూ.100, రూ.200, రూ. 500 లకు కొట్టించడం కన్నా లీటర్ పెట్రోల్ ను కొట్టించుకోవడం మంచిది. ఎందుకంటే పెట్రోల్ రీడింగ్ చేసే సమయంలో మెషిన్ రౌండ్ ఫిగర్ ను మార్చుకునే అవకాశం బ్యాంక్ యజమానులకు ఉంటుంది. ట్యాంక్ ఫుల్ చేయించుకునేటప్పుడు పైన మూత పెట్టి క్లోజ్ చేసే వరకు రౌండ్ ఫిగర్ కొట్టించడం వలన రూ.10, రూ. 20, కి పెట్రోల్ తక్కువ వచ్చే అవకాశం ఉంది.
అందుకే పెట్రోల్ వాహనాలకు నింపించుకునే సమయంలో మీ డబ్బుల్ని వృదా కాకుండా జాగ్రత్త పడండి. కాబట్టి ముందు జాగ్రత్త కోసం లీటర్ పట్టించుకోండి. ఒకవేళ అంతగా అవసరం అయితే జాగ్రత్తగా దగ్గరుండి మరీ పెట్రోల్ రీడింగ్ ను గమనిస్తూ నింపింకోండి.