మేకపాటి ఫ్యామిలీకి రాజకీయంగా గట్టి భరోసా!

Purushottham Vinay
నెల్లూరు జిల్లాలో ప్రముఖ రాజకీయ కుటుంబం అయిన మేకపాటి వారు ఇపుడు ఏం చేస్తారు వారిని అధికార పార్టీ ఏ విధంగా కలుపుకుని ముందుకు వెళ్తుంది అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ నెల 28 వ తేదీన నెల్లూరు జిల్లాలోని కనుపర్తిపాడులోని వీపీయార్ కన్వెన్షన్ హాలులో గౌతం రెడ్డి గారి సంతాపసభ జరగనుంది.ఈ సభకు ముఖ్య ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి జగన్ హాజరవుతున్నారు. ఆ సభలో ఆయన కీలక ప్రసంగం చేస్తారు. గౌతం రెడ్డి తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు. అంతే కాదు మేకపాటి కుటుంబానికి రాజకీయంగా గట్టి భరోసా ఇస్తారని అంటున్నారు. ముఖ్యంగా ఈ సభలోనే ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారనే విషయం కూడా వెల్లడి అవుతుందని అంటున్నారు.గౌతం రెడ్డి గారి భార్యకి టికెట్ ఇవ్వాలని వైసీపీ అనుకుంటోంది అని అంటున్నారు.




మరి ఆ విషయం జగన్ మోహన్ రెడ్డి సమావేశంలో ప్రకటిస్తారా అన్నది చూడాలి. అదే విధంగా మేకపాటి కుటుంబం వైసీపీకి బ్యాక్ బోన్ కాబట్టి ఆ కుటుంబాన్ని కలుపుకుని నెల్లూరు జిల్లాలో పొలిటికల్ గా ముందుకు సాగాల్సి వస్తుంది. నిజానికి గౌతం రెడ్డి గారు కనుక బతికి ఉంటే మంత్రి వర్గ విస్తరణలో ఆయన్ని కొనసాగించేవారు అన్న మాట కూడా ఉంది.ఆయన చేపట్టిన కీలక మంత్రిత్ర శాఖలు కూడా అలాంటివి. పైగా జగన్ మోహన్ రెడ్డి మనసెరిగిన నేత. దాంతో ఆయన తప్పకుండా కొనసాగుతారు అని అంతా కూడా అనుకున్నారు. కానీ ఇపుడు చూస్తే గౌతం రెడ్డి గారు లేరు. ఆయన సతీమణికి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నా ఆమె రాజకీయంగా జూనియర్ కావడంతో మంత్రి పదవి ఇస్తారా అన్న చర్చ కూడా నడుస్తుంది. 




ఇక మేకపాటి కుటుంబంలో చూస్తే గౌతం బాబాయ్ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు.ఆయన ఓ సీనియర్ నేత. అయితే ఈసారి సెలెక్ట్ చేయబోయేది ఎన్నికల క్యాబినెట్. అందువల్ల కచ్చితంగా దూకుడుగా ఉండే నేతలకే మంత్రి పదవులు ఇవ్వాలని జగన్ నియమం పెట్టుకున్నట్లుగా సమాచారం తెలుస్తోంది.అలాగే నెల్లూరు జిల్లాలో మిగిలిన ఎమ్మెల్యేలు కూడా చాలా మంది రేసులో ఉన్నారు. దాంతో జగన్ మేకపాటి కుటుంబాన్ని పక్కన పెట్టే పరిస్థితి కూడా ఉండవచ్చు అంటున్నారు. మరి అదే కనుక జరిగితే ఆ కుటుంబం నుంచి ఏమైనా అసంతృప్తి స్వరం బయటకు వస్తుందా అన్నది కూడా చూడాలి.మొత్తానికి చూస్తే గౌతం రెడ్డి గారి సంతాప సభ మాత్రం ఆసక్తిని రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: