చెవిరెడ్డి-భూమనకు మళ్ళీ ఛాన్స్ లేదా?
ప్రస్తుతం చిత్తూరులో మంత్రులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి ఉన్నారు...మరి వీరి పదవులు ఉంటాయో ఊడతాయో క్లారిటీ లేదు...జగన్ చెప్పిన విధానం బట్టి చూస్తే ఇద్దరు పదవులు ఊడిపోయేలా ఉన్నాయి..అంటే చిత్తూరులోరెండు పదవులు భర్తీ చేసే ఛాన్స్ ఉంది...ఈ రెండు పదవుల కోసం గట్టి పోటీ ఉంది..ఓ వైపు రోజా, చింతల రామచంద్రారెడ్డి సైతం పదవి కోసం పోటీ పడుతున్నారు...ఈ ఇద్దరు రెడ్డి వర్గం నేతలే. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి సైతం మంత్రి పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ నలుగురిలో ఒక్కరికే పదవి దక్కే ఛాన్స్ ఉంది..ఎందుకంటే రెడ్డి వర్గం వారిని ఎక్కువ మందిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ ఒక్క ఛాన్స్ దక్కించుకోవడానికి నలుగురు గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఇక రోజా ఏ స్థాయిలో పదవి కోసం ట్రై చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు..టైమ్ దొరికితే చాలు చంద్రబాబుని తిట్టడం, జగన్‌కు భజన చేయడం చేస్తున్నారు.
ఇటు చెవిరెడ్డి సైతం పదవి కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు...చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో వరుసగా రెండుసార్లు గెలిచి సత్తా చాటారు కాబట్టి పదవిపై గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు ఇక తిరుపతి ఎమ్మెల్యే భూమన సైతం ఇదే చివరి ఛాన్స్ అన్నట్లు ట్రై చేస్తున్నారు. అయితే వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చెవిరెడ్డి, భూమనకు మంత్రివర్గంలో ఛాన్స్ దక్కడం కష్టమే అని తెలుస్తోంది.