దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయిగా?

VAMSI
ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ తగ్గేదేలే అంటూ తన దూకుడు పెంచుతోంది. ఇప్పటికే తన పుట్టినిల్లు చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలలో నిత్యం కరోనా కేసులు లక్షల్లో పెరుగుతున్నాయి. ఇటు మన దేశం లోనూ ఇపుడు తాజాగా కరోనా కేసులు పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు ఈ వైరస్ కనుమరుగయ్యే రోజులు దగ్గర పడుతున్నాయి అని దేశ ప్రజలు సంతోషంగా ఉంటున్న సమయంలో మళ్ళీ పాజిటివ్ కేసుల సంఖ్యలో జరుగుతున్న మార్పులు పెరుగుతున్న బాధితులను చూస్తుంటే మళ్ళీ కరోనా తిరగబడుతుందా ఏమిటి అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి .

అయితే కరోనా తీవ్రత ఇపుడు బాగా తగ్గిందని పెద్దగా ప్రభావం ఉండటం లేదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రభావం పెద్దగా ఉండబోదని వారు అంటున్నారు. అయితే నిర్లక్ష్యం విపత్తుకు  దారి తీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందు జాగ్రత్తే శ్రీ రామ రక్ష అంటున్నారు. ఎందుకంటే పలు దేశాల్లో మళ్ళీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న వేళ వ్యాప్తి వేగం పుంజుకుంది. ఇది ఇతర దేశాలకు కూడా పాకే అవకాశం ఉందన్న విషయం గతంలో అనుభవమే. అందుకే కరోనా జాగ్రత్తలు, సూచనలు తప్పక పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకోని వారు వేసుకోవాలని అలాగే బూస్టర్ డోసు లను కూడా సదరు ప్రజలు వేసుకుని సురక్షితంగా వుండాలని కోరుతున్నారు. ముప్పతిప్పలు పెట్టి ఎందరో ప్రజల ప్రాణాలను బలిగొన్న ఈ మాయదారి వైరస్ ఎప్పటికి శాంతించి పూర్తిగా ఈ భూమిని విడిచి వెళుతుంది తెలియడం లేదు. ఈ విషయం మహా మహా శాస్త్రవేత్తలకు  సైతం అంతుపట్టడం లేదు. మరి ముందు ముందు ఏమి జరుగుతుందో తెలియదు. ఏది ఏమైనా మన జాగ్రత్తలో మనము ఉండడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: