ఇక హిందూపురంలో ఎమ్మెల్యే తరపున ప్రజల బాధలు తీర్చమని తన పీఏగా బాలకృష్ణ పెట్టుకున్న వ్యక్తి అక్కడ వైసీపీ నేతలతో కలిసి పేకాట ఆడుతూ జల్సా చేయడం జరిగింది. ఎవరూ పట్టుకోరని అనుకున్నారో ఏమో లేకపోతే మరింత సేఫ్ జోన్ లో వున్నాడు అనో కానీ.. ఆంధ్ర ప్రదేశ్ ఇంకా కర్ణాటక రాష్ట్ర సరిహద్దు లోని నగరిగేర వద్ద డెన్ ఏర్పాటు చేసుకుని మరి ఆ వ్యక్తి పేకాట ఆడుతున్నారు. ఇక విషయం తెలిసిన అక్కడి కర్ణాటక పోలీసులు వెంటనే రంగంలో దిగి వారిపై దాడులు చేశారు. ఇక హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పి ఎ బాలాజీ తో పాటు అధికార పార్టీకి చెందిన హిందూపూర్ మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ శ్రీ రామ్ రెడ్డి తో పాటు 19 మందిని కర్ణాటక రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది.ఇక నిందితులను కర్ణాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్ జిల్లా గుడిబండ కోర్టులో హాజరుపరిచడం కూడా జరిగింది.
హీరో నందమూరి నట సింహం బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన తరపున పీఏలే ఎక్కువ పనులు చక్క బెడుతూ ఉంటారు. ఇక అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన పీఏలు చేసిన వ్యవహారాలతో బాలకృష్ణ చాలా ఇబ్బంది కూడా పడ్డారు. తర్వాత ఆయన పలుమార్లు పీఏలను మార్చుకున్నారు. ఇప్పుడు పీఏగా ఉన్న బాలాజీ అయితే ఏకంగా వైసీపీ నేతలతోనే కలిసి ఏమాత్రం భయం అనేది లేకుండా పేకాట ఆడుకుంటున్నారు. ఇక ఈ వ్యవహారం ఇప్పుడు మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అవుతోంది.నందమూరి బాలకృష్ణ షూటింగ్‌లతో బిజీగా ఉంటున్నారని..ఆయన్ని కాస్త ప్రజల బాధల్ని చూడమని పెట్టిన పీఏలు కూడా అడ్డదోవ తొక్కుతున్నారని టీడీపీ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల మూడ్ వస్తున్న సమయంలో ఇలాంటి పీఏల్ని పెట్టుకుని బాలకృష్ణ.. ఇక ఎలా ఈ ఎన్నికలను ఈదుతారోనన్న చర్చసహజంగానే జరుగుతుంది.