అదొక చిన్న సెలూన్.. కరెంట్ బిల్లు ఎంత వచ్చిందో తెలుసా?

praveen
కొన్ని కొన్ని సార్లు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఏకంగా సామాన్య ప్రజలకు ఊహించని షాక్ ఇస్తోంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే కేవలం వందల్లో మాత్రమే వచ్చే కరెంట్ బిల్ ఏకంగా కొన్ని కొన్ని సార్లు వేలల్లో కాదు ఏకంగా లక్షల్లో వస్తూ ఉంటుంది. ఇప్పటివరకు ఇలా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిపోయిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఏకంగా లక్షల్లో కరెంట్ బిల్లు వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేసాయ్ అనే విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. నాయి బ్రాహ్మణులు రజకులు సెలూన్ లాండ్రీ షాప్ లో నెలకు 250 యూనిట్ల వరకు విద్యుత్ ను ఉచితంగా వాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.


 ఈ మేరకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన మీటర్లను కూడా ఉచితంగా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయంతో ఆయా వర్గాల ప్రజలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ.. ఇటీవలే మధిర పట్టణంలోని సిపిఎస్ రోడ్డులో గల ఒక సెలూన్ షాప్ కి వచ్చిన బిల్లు చూసి అందరూ షాక్ అవుతున్నారు. అది ఒక చిన్న సెల్ షాప్ ఇక కనీసం నెలకు 100 యూనిట్లు కూడా వాడటం లేదు. ఒకవేళ ఉచితంగా ఇవ్వకుండా బిల్లు వేసిన కేవలం మూడు వందల మాత్రమే వస్తుంది. ఇక్కడ ఎవరూ ఊహించని విధంగా ఏకంగా 19671 రూపాయలు కరెంటు బిల్లు వచ్చింది. ఈ ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది.


 ఖమ్మం జిల్లా మధిరకు చెందిన నాగులవంచ అప్పారావు అనే నాయిబ్రాహ్మణుడు సిపిఎస్ రోడ్డులో ఆరేళ్లుగా సెల్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఇక ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పడంతో మీ సేవ కేంద్రం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంతో అతనికి ఒక విద్యుత్ మీటర్లు అమర్చారు అధికారులు. అయితే అప్పారావు నెలకు కనీసం 100 యూనిట్లు కూడా విద్యుత్ వాడటం లేదు. కానీ ఏకంగా అతని బిల్లు మాత్రం 19671 రూపాయి రావడంతో ఆందోళనకు గురయ్యాడు. విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన వాళ్ళు మాత్రం పట్టించుకోలేదు. బిల్లు కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తానని చెప్పారు. ఇక ఈ ఘటన కాస్త సంచలనం గా మారిపోయింది. వెంటనే ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పందించాలని బాధితులు కోరుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: