మంత్రి బొత్స: కరెంటు బిల్లు కట్టకుంటే కరెంటు కట్?

VAMSI
ఏపి రాజకీయాల్లో మరో దుమారం మొదలయ్యింది. కరెంట్ బిల్లులు కట్టకపోతే, అందులోనూ రెండు మూడు నెలలు గడుస్తున్నా కట్టకపోతే కరెంట్ కట్ చేస్తారు ఇది కొత్తగా వింటున్న వింత విషయమేమీ కాదు. అలాగే ఆస్తి పన్ను కట్టకపోతే ఆస్తులు జప్తు చేయడం వంటివి ఎప్పటి నుండో చూస్తూ వస్తున్నవే? చెత్త పన్ను, ఆస్తి పన్ను వంటి పలు రకాల పన్నుల పేరిట అధికారులు ప్రజల్ని పీల్చి పిప్పిచేస్తున్నారని, బిడ్డల్లా పాలించాల్సిన ప్రజలపై దౌర్జన్యాలకు దిగుతున్నారని చెత్త పన్ను కట్టకపోవడంతో దుకాణాల ముందే చెత్తను పారబోసి అమానుషంగా ప్రవర్తిస్తున్నారు అంటూ ప్రభుత్వంపై కొన్ని ఆరోపణలు వస్తున్న మాట వాస్తవమే. రీసెంటుగా కర్నూల్ జిల్లాలో పన్ను కట్టలేదని చెత్త పోసిన ఘటనలు జరిగాయి.

అయితే ఇపుడు అలాంటి ఆరోపణలు మరియు కామెంట్ లపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ కి విచ్చేసిన ఆయన ఆ సందర్భంగా మాట్లాడుతూ ఆ ఆరోపణలను ఖండించారు. ఇవేమీ కొత్తగా వచ్చినవి కాదని, గతంలో ఉన్న పలు ప్రభుత్వాలు సైతం ఇదే పద్ధతిని పాటించిన విధానం మరిచిపోయారా ఏంటి ? అప్పుడు అంతా సైలెంట్ గా ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు గొంతు లేస్తోంది అంటూ స్ట్రాంగ్ గా అడిగారు. అయినా కరెంట్ బిల్లు కట్టక పోతే కరెంట్ తీసేయడం అంత తప్పు అనడానికి లేదు కదా?

ప్రభుత్వం సజావుగా పాలన కొనసాగించాలంటే కొన్ని చట్టాలకు కొన్ని విధి విధానాలకు కట్టుబడి ఉండాలి. అలాగే వైసీపీ ప్రభుత్వం కూడా చేసుకుంటూ పోతోంది. అలాగని కరెంటు బిల్లులు కట్టకపోతే నోటీసులు ఇవ్వడం వరకు సరే... కానీ ఇంటికి తాళాలు వేయడం మాత్రం సరి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే పన్నులు కట్టకపోతే స్థానిక సంస్థలు ఎలా అభివృద్ది చేయాలి అంటూ ప్రశ్నలు కురిపించారు మంత్రి బొత్స .  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: