వెస్ట్‌లో మళ్ళీ క్లీన్‌స్వీపేనా?
అందులోనూ పశ్చిమలో ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది...ఎందుకంటే 2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీలు కలిసి పోటీ చేయగా, అప్పుడు పవన్ కల్యాణ్ పోటీ చేయకుండా, ఆ రెండు పార్టీలకు మద్ధతు ఇచ్చారు...దీంతో పశ్చిమలో క్లీన్ స్వీప్ చేసేశారు..జిల్లాలో మొత్తం 15 సీట్లు ఉండగా, టీడీపీ 14 సీట్లు గెలుచుకోగా, పొత్తులో భాగంగా బీజేపీ తాడేపల్లిగూడెం సీటులో గెలిచింది. అంటే పశ్చిమలో క్లీన్ స్వీప్ జరిగిపోయింది...వైసీపీకి ఒక్క సీటు కూడా రాలేదు.
అయితే 2019 ఎన్నికలోచ్చేసరికి ఎవరికి వారు ఒంటరిగా పోటీ చేశారు...అటు టీడీపీ, ఇటు జనసేన సెపరేట్ గా పోటీ చేశాయి...దీంతో పశ్చిమలో భారీ స్థాయిలో ఓట్లు చీలిపోయి వైసీపీకి లబ్ది జరిగింది..వైసీపీ 13 సీట్లు గెలుచుకోగా, టీడీపీ కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది..అలా 2019 ఎన్నికల్లో వైసీపీ హవా నడిచింది.
మరి ఈ సారి టీడీపీ-జనసేన పార్టీల పొత్తు ఫిక్స్ అయ్యేలా ఉంది...పొత్తుతో ముందుకొస్తే మరొకసారి వెస్ట్ లో క్లీన్ స్వీప్ జరగడం ఖాయమని విశ్లేషణలు వస్తున్నాయి..15 సీట్లని టీడీపీ-జనసేనలు గెలిచుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు..అయితే ఎన్నికల నాటికి రెండు పార్టీలు ఇంకా ఎక్కువ కష్టపడితేనే ఫలితం ఉంటుందని చెబుతున్నారు. ఒకటి, రెండు సీట్లలో కాస్త ఇబ్బంది అయిన సరే ఎన్నికలనాటికి అంతా సెట్ అవుతుందని అంటున్నారు. చూడాలి మరి వెస్ట్ లో మళ్ళీ క్లీన్ స్వీప్ జరుగుతుందో లేదో?