
వామ్మో.. ఇక చికెన్ ను తినడం కష్టమే..ధర ఎంతంటే?
మటన్ ధరలు ఎప్పుడూ 700 నుంచి 900 వరకూ ఉంటుంది. కానీ ఇప్పుడు చికెన్ ధరలు కూడా మటన్ ధరలను రీచ్ అయ్యేలా కనిపిస్తున్నాయి.మార్కెట్ లో మాంసం ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో మాంసాహారప్రియులు అభిప్రాయాన్ని మార్చుకోవల్సిన పరిస్థితి ఎదురైంది. మధ్యతరగతి వాళ్ళకు మాత్రం ముక్క అంటే ముచ్చెమటలు పడుతున్నాయి. విషాయానికొస్తే.. నిర్మల్ జిల్లాలో కిలో చికెన్ రేటు రూ. 300 పలుకుతోంది. అదే విధంగా కిలో మేక మాంసం ధర రూ.700-800 ఉంది. వేసవికాలం కావడంతో పౌల్ట్రీ ఫామ్ నిర్వాహకులు కోళ్ల పెంపకందారులు హోల్ సేల్ రేట్లు పెంచడం మూలంగానే రిటైల్ చికెన్ ధరలు పెరిగినట్లు చికెన్ వ్యాపారులు చెపుతున్నారు.
ఈ వేసవి కాలంలో పెళ్ళిళ్ళు కూడా ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ధరలకు రెక్కలు వస్తున్నాయి. కేవలం పెళ్ళిళ్ళు మాత్రమే కాదు, జాతరలు, ఫంక్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. దాంతో మేకలు, గొర్రెల ధరలు అధికంగా ఉండటంతో వెజ్ ఫుడ్ వైపు పరుగులు తీస్తున్నారు. అంతేకాదు ఇంకా పండగలు వస్తే మాత్రం కోడికి నిజంగానే రెక్కలు వస్తాయి. రేపు హోలీ సందర్భంగా ధరలు అమాంతం పైకి కదిలాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు..చేపల కొనుగోలు వైపు మొగ్గుచూపుతున్నారు. చేపల ధరలు కిలోకి రూ.120-150 కే అందుబాటులో ఉండడంతో వీటికి కూడా డిమాండ్ పెరిగి పోతుంది.