స్మశాన బూడిదతో.. హోలీ పండుగ.. ఎక్కడంటే?
అయితే కొన్ని రకాల రంగులలో హానికరమైన కెమికల్స్ ఉంటాయని నిపుణులు హోలీ పండుగ సందర్భంగా హెచ్చరిస్తూ ఉంటారు. కొన్ని రకాల రంగుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని లేదంటే ఎలర్జి లు వచ్చే అవకాశం ఉంది అంటూ హెచ్చరిస్తూ ఉంటారు.. అయినప్పటికీ హెచ్చరికలను పట్టించుకోకుండా జనాలు మాత్రం తమకు ఇష్టమైన రంగులను స్నేహితులకు బంధువులపై చల్లడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ మాత్రం కాస్త విచిత్రంగా హోలీ పండుగ జరుపుకుంటారు. విచిత్రంగా ఎందుకు అన్నాను అంటే అక్కడ హోలీ పండుగ రోజు రంగులు వాడరు. మరి ఎలా హోలీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు అని అనుకుంటున్నారు కదా. ఏకంగా చితాభస్మంతో హోలీ పండుగ జరుపుకుంటారు.
ఏంటి షాక్ అయ్యారా.. కానీ ఇది నిజమే. దేశవ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా హోలీ జరుపుకుంటారు. ఇక కాశీ పుణ్యక్షేత్రం లో కూడా అందరికంటే భిన్నంగా హోలీ వేడుకలు జరుగుతాయి. ఇక హోలీ ఏకాదశితో ప్రారంభమవుతున్న రోజున అక్కడి ప్రజలందరూ మహేశ్వరుని సన్నిధికి సమీపంలోని స్మశానంలో చితి బూడిదతో హోలీ జరుపుకుంటారు. ఇక ఇలా చితాభస్మంతో హోలీ ప్రారంభించిన తర్వాత కాశీలో హోలీ పండగ మొదలవుతుంది అని చెప్పాలి. కాగా కాశీలోని హరిశ్చంద్ర ఘాట్ వద్ద చితి మంట ఎప్పుడూ మండుతూనే ఉంటుంది. ఇక గ్యాప్ లేకుండా దహన సంస్కారాలు జరుగుతూనే ఉంటాయి. దీంతో అక్కడ ఉన్న చితాభస్మంతో మొదట హోలీ వేడుకలు జరుపుకుంటారు అక్కడి ప్రజలు.