గోదావరి : జనసేన ఎంఎల్ఏ కత తేలిపోయిందా ?

Vijaya




పార్టీ నుండి జనసేన ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ ఔటైనట్లేనా ? తాజాగా పవన్ కల్యాణ్ నియమించిన కమిటిల్లో రాపాకకు స్ధానం లేకపోవటం దీన్నే సూచిస్తోంది. ఈనెల 14వ తేదీన పార్టీ ఆధిర్భావ దినోత్సవం సందర్భంగా  భారీ బహిరంగసభ జరగబోతోంది. సహజంగానే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కేంద్రబిందువుగా ఉంటారన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బహిరంగసభ సక్సెస్ కోసం పవన్ అనేక కమిటీలను నియమించారు.





పార్టీ తరపున పవన్ వివిధ అవసరాల కోసం 12 కమిటీలను నియమించారు. వీటిల్లో ఏ కమిటిలో కూడా పార్టీ ఏకైక ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ పేరు కనబడలేదు. చివరకు అన్నీ కమిటిల్లోకి కీలకమైన రాజకీయ తీర్మానాల రూపకల్పన కమిటిలో కూడా రాపాక పేరులేదు. దీంతోనే పార్టీ నుండి ఎంఎల్ఏ ఔటయ్యారని అందరికీ అర్ధమైపోయింది.  పార్టీ ఎంఎల్ఏని కలుపుకోవటంలేదు. ఇదే సమయంలో ఎంఎల్ఏ కూడా పార్టీతో అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు.





2019 ఎన్నికల్లో జనసేన తరపున గెలిచిన ఏకైక ఎంఎల్ఏ రాపాకను పార్టీ అవమానిస్తునే ఉంది. మొదట్లో పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమానికి ఎంఎల్ఏ హాజరయ్యేవారే. అయితే రాపాకను పవన్ ఏనాడు పట్టించుకోలేదు. రాపాక గెలవటం ఒక సమస్య అయితే తాను పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లోను ఓడిపోవటం పవన్ కు మరో సమస్యగా మారింది. దీంతో రాపాకను ఎంఎల్ఏగా గుర్తించటానికి పవన్ కు అహం అడ్డొచ్చింది. దీంతోనే ఎంఎల్ఏకి పవన్ తో పాటు పార్టీకి గ్యాప్ పెరిగిపోయింది.





ఈ కారణంగానే రాపాక అధికార వైసీపీకి దగ్గరయ్యారు. దాంతో పవన్ కు మరింతగా మండిపోయింది. అప్పటినుండి రాపాక పార్టీ కార్యక్రమాల్లో దేనిలోను పాల్గొనటంలేదు. పార్టీ కూడా ఎంఎల్ఏని ఆహ్వానించటంలేదు. పేరుకు జనసేన ఎంఎల్ఏనే అయినా రాపాక దాదాపు వైసీపీ ఎంఎల్ఏగానే అసెంబ్లీలోను, బయటా వ్యవహరిస్తున్నారు. అయితే పార్టీకి దూరంగా ఉంటున్న ఎంఎల్ఏపై పవన్ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవటమే విచిత్రంగా ఉంది.  అందుకనే పార్టీ ఆవిర్భావ సభ నిర్వహణ కమిటిల్లో ఎక్కడా ఎంఎల్ఏ పేరులేదు. దాంతోనే పార్టీ ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ ను పార్టీ పూర్తిగా వదిలేసినట్లు అర్ధమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: