లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి ప్రభుత్వం గుడ్ న్యూస్?

praveen
పేదింటి ఆడపిల్లకు పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి అనే పథకం ప్రవేశపెట్టింది అన్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ప్రతి పేదింటి ఆడపిల్లకు లక్ష 116 రూపాయలను అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం.  ఇక పెళ్లి సమయంలో పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులకు ఇక ఆర్థిక సహాయం చేసి అండగా నిలుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి ఇక ఈ పథకం ఎంతో విజయవంతంగా అమలు అవుతూ వస్తోంది..


 ఇప్పటికే ఎంతోమంది పేద యువతుల తల్లిదండ్రులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. ఇక ప్రతి యేటా బడ్జెట్లో 14 వందల యాభై కోట్ల రూపాయలను ఇక రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణలక్ష్మీ షాదీముబారక్ పథకాల కోసం కేటాయిస్తూ ఉండటం గమనార్హం. అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంచలన పథకాలలో ఇక ఇది కూడా ఒకటి అని చెప్పాలి. ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల అమలుపై ఇటీవల రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కీలక ప్రకటన చేశారు.



 ఇక మంత్రి గంగుల కమలాకర్ చేసిన ప్రకటనపై ప్రస్తుతం ఎంతోమంది హర్షం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. ఇంతకీ ఆ ప్రకటన ఏంటి అంటే.. లవ్ మ్యారేజ్ చేసుకున్న వారికి కూడా ఈ పథకం అమలు వర్తిస్తుంది అని ఇటీవల అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. భర్త బీసీ  అయ్యి భార్య ఓసి అయినా కూడా కళ్యాణ లక్ష్మి వర్తిస్తుందని  వారికి కూడా చెక్కుల పంపిణీ చేస్తాము అంటూ అసెంబ్లీ వేదికగా మంత్రి గంగుల కమలాకర్ ప్రకటన చేశారు. ఇక ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సమస్యలు లేవని అంటూ స్పష్టం చేశారు.  ఇలా కళ్యాణలక్ష్మీ షాదీముబారక్ పథకాల విషయంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: