నగిరిలో ఎమ్మెల్యే రోజానీ ఢీ కొట్టేందుకు.. రంగంలోకి మరో నటి?

praveen
నగరి లో తిరుగులేని ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు రోజా. అయితే రోజా ఎమ్మెల్యే కావడానికి రాజకీయ నాయకురాలిగా ఉన్న ఫాలోయింగ్ తో పాటు నటిగా ఉన్న ప్రేక్షకాదరణ కూడా ఒకటి అనే విషయం తెలిసిందే. ఇక పోతే ఇక ఇప్పుడు నగరి నియోజకవర్గంలో రోజా కి  పోటీ లేదు అనుకుంటున్న సమయంలో ఏకంగా రోజాను ఢీ కొట్టేందుకు మరో నటిసిద్ధమైంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. ఇలా నటి ఎమ్మెల్యే రోజా ని నగరి నియోజకవర్గంలో ఎన్నికల్లో ఢీ కొట్టబోయే నటీమణి ఎవరో కాదు వాణి విశ్వనాథ్.


 ఇటీవల చిత్తూరులోని నగరి నియోజకవర్గం లో నిర్వహించిన మహిళలు ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్నారు ఆమె. తనకు నగరిలో ఎంతోమంది అభిమానులు ఉన్నారని.. ఇక వారి కోరిక మేరకే నగరిలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నాము అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఏ పార్టీ తరపున పోటీ చేస్తా అన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేను అంటూ తెలిపింది వాణి విశ్వనాథ్. ఇక అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది అని.. వచ్చే ఎన్నికల్లో మాత్రం నగరి నియోజకవర్గంలో పోటీ చేయడం ఖాయం అంటూ కుండబద్దలు కొట్టేసింది. తన మేనేజర్ రామానుజన్ చలపతికి రాజకీయంగా ఎంతో అన్యాయం జరిగిందని.. ఇది చూసి సహించలేక ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అయినట్లు వాణి విశ్వనాథ్ చెప్పుకొచ్చింది.


 ఇక నగరిలో తన అమ్మమ్మ నర్సుగా పని చేశారని ఈ ప్రాంతవాసులు తనకు సుపరిచితులే అంటూ వాణి విశ్వనాథ్ చెప్పుకొచ్చింది. అయితే నగరిలో తమిళ సంస్కృతి ఉందని అందుకే ఇక్కడి నుంచి మాత్రమే పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎప్పటికీ ముందు ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది. ఒకవేళ అవసరం అయితే ఏ పార్టీ నుండి కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా సైతం పోటీ చేయడానికి రెడీగా ఉన్నానని తెలిపింది వాణి విశ్వనాథ్. కాగా ఒకప్పుడు పాపులర్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకున్న వాణి విశ్వనాథ్ ఇక ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: