అమరావతి : జగన్ అంటే ఇంత కడుపుమంటుందా ?

Vijaya



జగన్మోహన్ రెడ్డి అంటే జనసేన రాజకీయ వ్యవహారాల కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కు ఇంత కడుపుమంటుందో బయటపడింది. సినిమా ఇండస్ట్రీ జగన్ కు తొందరలో సన్మానం చేయటానికి రెడీ అవుతోంది. ఈ విషయంపైనే నాదెండ్ల మాట్లాడుతు జగన్ ఏమి చేశారని సన్మానిస్తున్నారో తనకు అర్ధం కావటంలేదన్నారు. సినిమా టికెట్ల ధరలు ఎందుకు తగ్గించారు ? ఇపుడు ఎందుకు పెంచారో ముందు సమాధానం చెప్పాలని నిలదీశారు.





వకీల్ సాబ్ సినిమాకు ముందు టికెట్ల ధరలు తగ్గించింది పవన్ కల్యాణ్ ను దెబ్బకొట్టేందుకే అన్నట్లుగా నాదెండ్ల వ్యాఖ్యలున్నాయి. సినిమా ఇండస్ట్రీని ఇబ్బందులు పెడుతున్న జగన్ కు సన్మానం ఎందుకు చేయాలంటు మండిపోయారు. టికెట్ల ధరలతో పాటు ఇతర సమస్యలు పరిష్కారించినందుకు సినీప్రముఖులు చిరంజీవి, మహేష్ బాబు, రాజమౌళి లాంటి వాళ్ళు జగన్ కు థ్యాంక్స్ చెబుతు ట్వీట్లు పెట్టారు.





అలాగే చలనచిత్ర వాణిజ్యమండలి ప్రముఖులు కూడా జగన్ కు ధన్యవాదాలు చెప్పారు. ఇదే విషయమై తొందరలోనే జగన్ కు సన్మానం చేయాలని కొందరు ప్రముఖులు ఆలోచిస్తున్నారు. సినీ ప్రముఖుల ఉద్దేశ్యం ఏమిటంటే ప్రభుత్వంతో గొడవలు లేకుండా సామరస్య వాతావరణం ఉంటే బాగుంటుందని మాత్రమే.  దీన్నే నాదెండ్ల తట్టుకోలేకపోతున్నారు. టికెట్ల ధరల విషయంలో పవన్ నోటికొచ్చినట్లు మాట్లాడితే పరిశ్రమ ప్రముఖులు ఒక్కరు కూడా మద్దతుగా నిలవలేదు. అప్పటినుండి పవన్+నాదెండ్లలో పరిశ్రమలోని ప్రముఖులపై మండిపోతున్నారు.





అయినా ఎవరో ఇంకెవరికో సన్మానం చేయాలని అనుకుంటే మధ్యలో నాదెండ్లకు ఏమైంది ? జగన్ పై సినీపరిశ్ర పెద్దలు తిరగబడాలని నాదెండ్ల పిలుపివ్వటమే విచిత్రంగా ఉంది. జగన్ పై పవన్ కు పడకపోతే మిగిలిన వాళ్ళు కూడా సీఎంతో గొడవలు పెట్టుకోవాల్సిందేనా ? నాదెండ్ల మాటల్లోని లాజిక్కు ఏమిటో అర్ధంకావటంలేదు. ఎవరితో అయినా గొడవలుంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పాల్సిన పెద్దమనిషి నాదెండ్ల అందరినీ జగన్  పై తిరగబడమని చెబుతున్నారంటేనే ఆయనలోని కడుపుమంట అర్ధమైపోతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: