ఉక్రెయిన్ : రష్యా యుద్ధానికి ప్రధాన కారణం ఇదేనా ?

Vijaya




ఉక్రెయిన్ పై రష్యా గడచిన 13 రోజులుగా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. అసలు ఉక్రెయిన్ పై రష్యా ఎందుకు యుద్ధానికి దిగింది ? అంటే ఇందుకు చాలా కారణాలే ఉన్నా ప్రధానమైన కారణాలు మాత్రం మూడు నాలుగే. వీటిల్లో కూడా అత్యంత ప్రధానమైన కారణం నీరేనట. అవునే మీరు చదివింది కరెక్టే. నీటి కోసమే అంటే మనదేశంలో కర్నాటక-తమిళనాడు, కేరళ-తమిళనాడు మధ్య గొడవలు జరుగుతున్నట్లే రష్యా-ఉక్రెయిన్ మధ్య కూడా ఎప్పటినుండో నీటి సమస్యలున్నాయట.





రష్యా ఆధీనంలోని క్రిమియా దీవికి ఉక్రెయిన్ నీటి సరఫరాను నిలిపేసిందట. క్రిమియాలో సుమారు 25 లక్షలమంది నివసిస్తున్నారు. వీరిలో అత్యధికులు రష్యావాళ్ళే. క్రిమియా దీవికి నీటి సరఫరా మొత్తం ఉక్రెయిన్లో నుండే వెళుతుందట. అందుకనే డెనివర్ నదిపై ఉక్రెయిన్ పెద్ద డ్యాం కట్టేసి నీటిని క్రిమియాకు పోకుండా అడ్డుకుంటుందోట. క్రిమియాలోని జనాల అవసరాల కోసం తాగు, సాగునీటిని కావాలనే ఉక్రెయిన్ నిలిపేస్తోందని రష్యా ఎప్పటినుండో గోల చేస్తోంది. అయితే దాన్ని ఉక్రెయిన్ ప్రభుత్వం ఏమాత్రం లెక్కచేయటంలేదు.





క్రిమియాలోని జనాల తాగు, సాగు నీటి అవసరాలతో పాటు నౌకాస్దావరాలకు కూడా అవసరమైన నీరు అందటంలేదట. దాంతో నీటి సమస్యకు తోడు ఇతర అంశాలు కూడా తోడవ్వటంతో ఉక్రెయిన్ పై రష్యా విరుచుకుపడుతోంది. 13 రోజుల యుద్ధంలో డెనివర్ నదిపైన ఉక్రెయిన్ నిర్మించిన డ్యాంను రష్యా సైన్యం పేల్చేసింది. దాంతో ఒక్కసారిగా ప్రాజెక్టు నుండి నీరు క్రిమియావైపు ప్రవహిస్తోంది. దాంతో క్రిమియాలోని జనాలంతా పిచ్చ హ్యాపీగా ఉన్నారట.




అలాగే రష్యా సైన్యం ఎక్కువగా ఖెర్సన్ ప్రాంతంమీద దాడులు చేసి నగరాన్ని తమ అదుపులోకి తీసుకుంది. దీనికి కూడా ఒక కారణముందట. అదేమిటంటే ఖెర్సన్ నగరంలో నుండే డెనివర్ నదిలో నుండి నీటి సరఫరా కెనాల్సున్నాయట. ఈ కెనాల్సును నియంత్రించటం ద్వారానే ఉక్రెయిన్ క్రిమియాకు నీటి సరఫరాను చేయకుండా బాగా ఇబ్బంది పెడుతోందట. అందుకనే ముందు డెనివర్ డ్యాంను కూల్చేసింది. తర్వాత ఖెర్సన్ కెనాల్స్ అన్నింటినీ రష్యా అదుపులోకి తీసుకుంది. మొత్తానికి నీటి సరఫరా ఆపేయటం ఎంతటి పనిచేసిందో.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: