"దళితబంధు" లబ్ధిదారుల్లో 90 శాతం ఆ పార్టీవారే?

VAMSI
తెలంగాణ రాష్ట్రానికి గానూ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను నిన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు శాసనసభలో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ లో ఎప్పటిలాగే కొన్ని ముఖ్యమైన అంశాలకు బడ్జెట్ ను కేటాయించారు. కానీ ఒక్క పథకంపై మాత్రం విమర్శల వెల్లువ కురుస్తూ ఉంది. గత సంవత్సరం హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకు వచ్చిన దళితబంధు పథకం గురించి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ పథకం కింద 11,800 దళిత కుటుంబాలకు ప్రయోజనం చేకూరినట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి.

అంతే కాకుండా రానున్న రోజుల్లో ఆ సంఖ్యను 2 లక్షల కుటుంబాలు వరకు చేరే  విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా మంత్రి హరీష్ రావు ప్రకటించారు.  అయితే విపక్షాలు ఈ పథకం గురించి కొన్ని వాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు దళిత బంధు పథకం కింద లబ్ధి పొందుతున్న వారిలో దాదాపు అందరూ తెరాస పార్టీకి చెందిన వారే అని పలువురు విమర్శిస్తున్నారు. మామూలుగా దళిత బంధు పథకానికి అర్హులను ఎంపిక చేసే అధికారం ఎమ్మెల్యే లకు కల్పించింది తెరాస ప్రభుత్వం. దీనితో ఎమ్మెల్యే లు తమ పార్టీ వారిని మాత్రమే లబ్దిదారులుగా ఎంపిక చేస్తున్నారట. ఇక ఎవ్వరికీ అనుమానం కలుగకుండా 100 లో 10 శాతం మంది ఇతరులను కూడా ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలా చేయడం వలన రాష్ట్రంలో వాస్తవంగా పేదరికంలో ఉన్న వారు అన్యాయం అయిపోతున్నారు.  ఈ దళిత బంధు పథకంలో ఎదురయిన ఈ సమస్య లో వాస్తవం ఉందా? ఒకవేళ నిజమే అయితే సంబంధిత అధికారులకు ఫిర్యాదులు అందాయా? అందినా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదా అన్న పలు ప్రశ్నలు కలుగుతాయి. మరి ఈ సంవత్సరం గతంలో కంటే 7700 కోట్లు ఎక్కువగా కేటాయించారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: