ఏపీలో వంట నూనెల ధరల్లో మోసం... విజిలెన్సు దాడులు కీలక విషయాలు?

VAMSI
మన ప్రపంచంలో ఎక్కడ ఏ విధమైన సంక్షోభం వచ్చినా ఆ ప్రాంత పరిస్థితులను బట్టి కొన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంటాయి. అయితే ఇలా పెరిగిన వస్తువుల ధరలు ప్రజల జీవితాలపై చాలా ప్రభావాన్ని చూపుతాయి. అయితే గత రెండు వారాలుగా రష్యా మరియు యుక్రెయిన్ దేశాల మధ్య ఆధిపత్యం కోసం జరుగుతున్న యుద్ధం కారణంగా ఇప్పటికే చాలా నష్టాలు సంభవించాయి. గత మూడు రోజుల నుండి ఆయిల్ ధరలు పెరుగుతున్నాయన్న మాట వింటూనే ఉన్నాము. అందులో భాగంగా వంట నూనెల ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ ధరల కారణంగా ప్రజలు చాలా ఇబంది పడుతున్నట్లు తెలుస్తోంది.

అయితే యుద్ధం వలన ఆయిల్ ధరలు పెరుగుతాయి అని చెప్పంగానే, పెరగడం వాస్తవమో లేదో తెలియదు కానీ ఇక్కడ కిరాణా షాపుల యజమానులు తమకు తామే పెంచేస్తున్నారు. అయితే సరుకులు కొనడానికి వెళ్లిన ప్రజలు ఈ విషయం గమనించి లబోదిబోమంటుంటే దీనిపై ప్రభుత్వం అప్రమత్తం అయింది. చిత్తూరు జిల్లా లోని తిరుపతిలో పాళీ షాపులలో విజిలెన్సు అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ తనిఖీలలో అధికారులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. వాటిలో ముఖ్యంగా చూస్తే, వంట నూనెలను సాధారణ ధరల కంటే అధిక మొత్తానికి అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు.

అంతే కాకుండా ఇంకా అధిక లాభానికి అమ్ముకోవడానికి కొంత మొత్తంలో ఆయిల్ ప్యాకెట్ లను నిల్వ చేసుకున్నారని ఈ తనిఖీలో బయట పడింది. అయితే ఒక్క సరిగా ఒక్కో ఆయిల్ ప్యాకెట్ ధరను 150 నుండి 180 రూపాయల మేరకు పెంచుకుని అమ్ముతున్నారట. అయితే ఇలా బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న షాప్ యజమానులపై విజిలెన్సు అధికారులు తగు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని చోట్ల 185 రూపాయలుగా కూడా అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: