గవర్నమెంట్ ఉద్యోగికి ఎన్ని రకాల బెనిఫిట్స్ అనేవి ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మంచి జీతం,ఒత్తిడి లేని పని.చాలా హాయిగా చేసుకుంటూ పోవచ్చు.ఇక అసలు విషయానికి వస్తే..ఇక మార్చి నెల చివరి నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని శుభవార్తలు అందే అవకాశం పుష్కలంగా ఉంది. ఇక మీడియాలో ప్రసారమవుతున్న వివిధ రకాల నివేదికల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం వారి జీతంలో పెరుగుదలకు దారితీసే డియర్‌నెస్ అలవెన్స్ (DA)లో పెంపును ప్రకటించే ఛాన్స్ అనేది పుష్కలంగా ఉంది.ఇక ఈ పెంపు దాదాపు 3 శాతంగా ఉండవచ్చని, ఈ చర్యతో కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న కోటి మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం అనేది చేకూరనుంది.ప్రస్తుతం డీఏ అనేది 31 శాతం ఉండగా, పెంపు తర్వాత 34 శాతానికి పెంచడం అనేది జరుగుతుంది.ఇక ఒక నివేదిక ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే..చాలా మంది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు అనేవి కూడా రూ. 90,000 వరకు పెరుగడం అనేది జరుగుతుంది.
ఇక JCM కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా ప్రకారం, ద్రవ్యోల్బణం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు అనేవి పెరగాలి. అయితే పెండింగ్‌లో ఉన్న 18 నెలల డీఏ బకాయిల పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పష్టత అనేది ఇవ్వలేదు.ఇక ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసే ఒక ఉద్యోగికి రూ.30,000 జీతం కనుక లభిస్తే, డీఏలో 3 శాతం పెంపుతో, వారి జీతం నెలకు రూ.900 అనేది పెరుగడం జరుగుతుంది. దీంతో ఏడాదికి రూ.10,800 వరకు జీతం అనేది వారికి సులభంగా పెరుగుతుంది. ఇక అలాగే క్యాబినెట్ సెక్రటరీ స్థాయి ఉద్యోగుల జీతాలు వచ్చేసి నెలకు రూ.7,500 పెరగడం అనేది జరుగుతుంది.అయితే, గరిష్టంగా రూ.2.5 లక్షల జీతం పొందే ఉద్యోగులకు మాత్రం ఇక ఏడాదికి రూ.90,000 వరకు పెంపుదల అనేది ఉంటుంది.చూశారు కదండీ.. ఒక గవర్నమెంట్ ఉద్యోగికి ఎన్ని రకాల ప్రయోజనాలు అనేవి వున్నాయో.. కాబట్టి కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించండి.మీ పిల్లలను కూడా బాగా చదివించి మంచి గవర్నమెంట్ ఉద్యోగిగా మలచండి.