సొంతిళ్ళు కట్టుకునే వారికీ.. కేసీఆర్ గుడ్ న్యూస్?

praveen
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఇక ముఖ్యమంత్రి కెసిఆర్ పదవి బాధ్యతలు చేపట్టారు.. ఇక అప్పటినుంచి ఇప్పటివరకూ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు సాగుతున్నారు. పేదల అభ్యున్నతి కోసం ఇప్పటికే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ క్రమంలోనే ప్రతి పేదవాడికి సొంతింటి కల సాకారం అయ్యేందుకు ఇల్లు కట్టుకోవాలి అనుకునే పేద ప్రజలకు  ఏకంగా ఐదు లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వం తరఫున అందజేస్తాం అంటూ సీఎం కేసీఆర్ ప్రకటించారు అన్న విషయం తెలిసిందే.


 ఒకరకంగా టిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడానికి భారీ మెజారిటీ రావడానికి ఇదే కారణమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా ప్రజలకు అండగా నిలిచేందుకు  ఇచ్చిన  హామిని అమలులోకి తీసుకు వచ్చేందుకు కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.  సొంత స్థలం నుండి ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారికి కేసీఆర్ సర్కార్ ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో సొంతింటి కలను సాకారం చేసేందుకు ఐదు లక్షలు ఇస్తాం అంటూ హామీ ఇచ్చిన మేరకు దీనిని అమలు చేయబోతున్నారట.


 వచ్చే బడ్జెట్లో దీనిపై ప్రకటన చేయబోతున్నారు అని తెలుస్తోంది. అయితే ఇక ఇలా ఇల్లు కట్టుకునే వారికి ఐదు లక్షలు ఇచ్చేందుకు బడ్జెట్లో ప్రత్యేకమైన నిధులు కేటాయించ పోతున్నారట. ఏప్రిల్ నుంచి ఈ పథకం అమలు లోకి రాబోతుంది అని తెలుస్తోంది. దీనికి సంబంధించి  ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేసిందట ప్రభుత్వం. ఈ పథకం అమలు లోకి వస్తే ఎంతో మంది ప్రజలకు లబ్ధి చేకూరుతుంది అని చెప్పాలి. ఇక ఈ పథకంతో పాటు వ్యవసాయ రంగంలో కూడా సరి కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని కేసీఆర్ సర్కార్ భావిస్తుందట. అంతేకాదు ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు కూడా రాబోతున్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: