పోలాండ్ లో తెలుగు విద్యార్ధుల వెతలు

Veldandi Saikiran
పొలాండ్‌ లో తెలుగు విద్యార్థులు అనేక ఇబ్డందులు పడుతున్నారు.  పొలాండ్‌ దేశంలో ఇప్పటి వరకు 400 మంది తెలుగు విద్యార్థులు చిక్కుకున్నట్లు సమాచారం అందుతోంది.  అక్కడ ఉన్నటు వంటి చలి తీవ్రత కారణంగా తెలుగు విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. ఇక తెలుగు విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం కూడా అనేక ప్రయత్నాలు చేస్తోంది. పొలాండ్‌ చిక్కుకున్న తెలుగు విద్యార్థులపై  వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా స్పందించారు.  వారిని ఎలాగైనా ఏపీకి తీసుకువస్తామని ప్రకటన చేశారు.  వారి బాధ్యత ఏపీ సర్కార్‌ దేనని చెప్పారు.  చంద్రబాబు, లోకేష్ , అచ్చెన్నాయుడు త్వరగా ఎన్నికలొచ్చేయాలని.. అధికారంలోకి వచ్చేయాలని తపన పడుతున్నారని ఈ సందర్భంగా ఆగ్రహించారు వెల్లంపల్లి శ్రీనివాస్.  మా ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లయ్యిందని.. ఇప్పటివరకూ బైఎలక్షన్ల దగ్గర్నుంచి  స్థానిక సంస్థల ఎన్నికల వరకూ అన్ని ఎన్నికలనూ ఎదుర్కొన్నామన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్.  

ఒక్క ఎన్నికలోనైనా టీడీపీకి సింగిల్ డిజిట్ వచ్చిందా.. అన్నం తినేటపుడు ఎవడూ అబద్ధాలాడతాడని అనుకోనన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్.  తిరుపతి బై ఎలక్షన్లలో పార్టీ లేదు బొక్కా లేదని అచ్చెన్నాయుడు అన్నాడా లేదా? చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు పగటి కలలు కంటున్నారన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్.  క్యాడర్ ను ఉత్సాహపరచడానికే పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందని మభ్యపెడుతున్నారని.. రాసి పెట్టుకోండి...జగన్‌ను ఓడించడం చంద్రబాబు, లోకేష్ తరం కాదని సవాల్‌ విసిరారు వెల్లంపల్లి శ్రీనివాస్.  ప్రజలందరూ జగన్ మోహన్ రెడ్డితోనే ఉన్నారని.. అచ్చెన్నాయుడు అచ్చోసిన ఆంబోతులా మాట్లాడుతున్నాడని..రాబోయే ఎన్నికల్లో అచ్చెన్నాయుడికి డిపాజిట్లు కూడా రావన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్.  కార్పొరేటర్ గా కూడా గెలవలేని వ్యక్తి లోకేష్ .. రాజకీయాల్లో లోకేష్ ఒక కమెడియన్ అన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్.లోకేష్ ను చిన్న నాయకుడిగా కూడా ఎవరూ పోల్చడం లేదని..చంద్రబాబుకి పూర్తిగా మతి భ్రమించింది.. ఉక్రెయిన్ లో విద్యార్ధులతో మాట్లాడానంటూ ... వారికి శుభాకాంక్షలు చెప్తున్నాడని ఆగ్రహించారు వెల్లంపల్లి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: