పొత్తు పాలిటిక్స్: జనసేనలో కొత్త టాక్?

M N Amaleswara rao
టీడీపీ-జనసేన పార్టీలు పొత్తు ఎప్పుడు పెట్టుకుంటాయో తెలియదు గాని..ఆ రెండు పార్టీల మధ్య పొత్తు గురించి పాలిటిక్స్ మాత్రం ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి...ఆ రెండు పార్టీలు అధికారికంగా పొత్తు పెట్టుకునే వరకు ఈ చర్చలు నడుస్తాయని చెప్పొచ్చు..ప్రస్తుతం కూడా ఏపీ రాజకీయాల్లో ఈ రెండు పార్టీల పొత్తు గురించి పెద్ద చర్చే నడుస్తోంది. టీడీపీ ఏమో జనసేనతో కలిసి ముందుకెళ్లడానికి బాగానే ఆసక్తి చూపిస్తుంది..ఆ విషయం ఈ మధ్య చంద్రబాబు కుప్పంలో మాట్లాడిన దాని బట్టి అర్ధమైంది.

కానీ పొత్తు విషయంలో ఇంకా తాము క్లారిటీగా లేమని...పవన్ కల్యాణ్‌కు ఉన్న కన్ఫ్యూజన్ బట్టి అర్ధమైంది..అయితే పవన్ పెద్దగా పొత్తుపై మాట్లాడకపోయినా సరే...జనసైనికులు మాత్రం పొత్తుపై తమకు నచ్చినట్లు మాట్లాడేస్తున్నారు..పొత్తు పెట్టుకుంటాం..పవన్‌కు సీఎం సీటు ఇస్తారా? లేదా 75 సీట్లు ఇస్తారా పొత్తు పెట్టుకుంటాం అని మాట్లాడుతున్నారు..ఇక జనసైనికులు మాట్లాడే మాటలు తెలుగు తమ్ముళ్ళకు కోపం తెప్పిస్తున్నాయి.

అసలు పొత్తు వద్దు..ఒంటరిగానే పోటీ చేద్దామని తమ్ముళ్ళు మాట్లాడుతున్నారు...ఒకవేళ పొత్తు పెట్టుకుని గెలిస్తే ఆ క్రెడిట్ అంతా తమదే అని జనసేన వాళ్ళు చెప్పుకుంటారని, దాని కంటే ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటితే బెటర్ అని తమ్ముళ్ళు అంటున్నారు. చంద్రబాబుకు కూడా అదే విషయం చెబుతున్నారు...జనసేనతో పొత్తు అవసరం లేదని మాట్లాడుతున్నారు...ఇక ఇదే సమయంలో పొత్తు గురించి జనసేనలో కొత్త టాక్ మొదలైంది..నెక్స్ట్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కింగ్ మేకర్ రోల్ పోషిస్తారని మాట్లాడుకుంటున్నారు.

అంటే నెక్స్ట్ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ దాటడం కష్టమని, అప్పుడు జనసేనకు వచ్చిన సీట్లతో ఏ పార్టీ అయిన ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, అప్పుడు పవన్ కల్యాణ్‌కు సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుందని జనసైనికులు చెప్పుకుంటున్నారు. మరి జనసైనికుల ‘పవన్ కల్యాణ్ కింగ్ మేకర్’ మాటలు నిజమవుతాయో లేదో తెలియాలంటే..నెక్స్ట్ ఎన్నికల వరకు ఎదురు చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: