ఉక్రెయిన్ అమ్మాయితో హైదరాబాది పెళ్లి.. ఎక్కడ జరిగిందంటే?
ఇలా ప్రస్తుతం రష్యా భీకరమైన దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఎటువైపు నుంచి బాంబ్ వచ్చి మీద పడి ప్రాణాలు పోతాయో అని అందరూ ఆందోళనలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే ప్రాణాలను కాపాడుకునేందుకు అటు సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు జనాలు. ఏకంగా లక్షల మంది ప్రజలు ఉక్రెయిన్ నుంచి ఇతర దేశాలకు వెళ్లి పోవడం గమనార్హం. ఉక్రెయిన్ లో తీవ్రస్థాయిలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న సమయంలో ఇటీవలి ఒక జంట పెళ్లితో ఒక్కటయ్యారు. ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల ఏకంగా ఒక హైదరాబాది యువకుడు ఉక్రెయిన్ చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనేది తెలుస్తుంది. హైదరాబాద్కు చెందిన యువకుడు ప్రతీక్ ఉక్రెయిన్ అమ్మాయి లిబోవ్ ను వివాహమాడాడు. ఇక వీరి వివాహం ఉక్రెయిన్లోనే జరిగింది. ఇక ఇటీవల భారతీయులను ప్రత్యేకమైన ఫ్లైట్ లో ఇండియాకు తీసుకురాగా ఇక వారి రిసెప్షన్హైదరాబాద్ లో జరగడం గమనార్హం. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సి ఎస్ రంగరాజన్ ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక నూతన వధూవరులను ఆశీర్వదించడం గమనార్హం. కాగా రష్యా యుద్ధం త్వరగా ముగియాలని కోరుకుంటున్నాము అంటూ నూతన వధూవరులు చెప్పారు..