హైదరాబాద్ : కాంగ్రెస్ బాధ్యతంతా ఈ వ్యూహకర్తదేనా ?

Vijaya


ఇవ్వాల్టి రోజుల్లో రాజకీయపార్టీలపై  వ్యూహకర్తల ప్రభావం పెరిగిపోతోంది. 2014లో ప్రశాంత్ కిషోర్ రూపంలో మొదలైన రాజకీయ వ్యూహకర్తలు నానాటికి పెరిగిపోతున్నారు. తాజాగా తెలంగాణా కాంగ్రెస్ సునీల్ కానుగోలు అనే రాజకీయ వ్యూహకర్తతో ఒప్పందం చేసుకున్నది. నిజానికి రాజకీయ వ్యూహకర్తలే రాజకీయపార్టీలను అధికారంలోకి తీసుకురాలేరన్నది నూరుశాతం వాస్తవం.





వాళ్ళు ఏ పార్టీ తరపున అయితే పనిచేస్తున్నారో ఆ పార్టీ నాయకత్వంలో దమ్ముండాలి. ఆ పార్టీ నాయకత్వంపై జనాల్లో నమ్మకం ఉండాలి. అప్పుడే సదరు రాజకీయపార్టీ అధికారంలోకి వచ్చే అవకాశముంది. రాజకీయ వ్యూహకర్తలు ఏమి చేయగలరంటే తమను ఎంగేజ్ చేసుకున్న పార్టీపై జనాభిప్రాయం సేకరించగలరు. అలాగే అధికారంలో ఉన్న పార్టీపై జనాభిప్రాయం ఏమిటో గ్రహించగలరు. తమకు ఎలాంటి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు ? ప్రభుత్వం నుండి తాము ఏమి కోరుకుంటున్నారు ? అనే విషయాలను సర్వే చేయగలరు.వ్యూహకర్తలు విఫలమైన సందర్భాలు కూడా ఉన్నాయి. 





తమను ఎంగేజ్ చేసిన పార్టీ అధినేతకు జనాబిప్రాయాన్ని నికచ్చిగా రిపోర్టు చేయగలరు. దీని ద్వారా పార్టీ విధాన పరమైన నిర్ణయాల్లో  అధినేత మార్పులు చేర్పులు చేసుకోగలరు. ప్రజలకు దగ్గరయ్యేందుకు అవరసరమైన పథకాలు, ప్రణాళికలను వ్యూహకర్తలు అందించగలరంతే. అంటే వ్యూహాకర్తల పనంతా తెరవెనుకకు మాత్రమే పరిమితమయ్యుంటుంది. పార్టీలోను, అధినేతలోను దమ్ములేకపోతే ఎంతటి వ్యూహకర్తయినా చేయగలిగేదేమీ లేదు.





ప్రస్తుతం తెలంగాణాలో అధికార టీఆర్ఎస్ బలంగానే ఉంది. కాకపోతే కేసీయార్ పై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని అధికారంలోకి రావటానికి బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇదే విధంగా కాంగ్రెస్ కూడా గట్టిగానే పోరాటాలు చేస్తోంది. అంటే అధికారం కోసం రెండు పెద్దపార్టీలు చాలా తీవ్రంగా పోరాడుతున్నాయి. ఇక్కడే కేసీయార్ ఫుల్లు అడ్వాంటేజ్ లో ఉన్నారు. ప్రతిపక్షాల మధ్య ఎన్ని ఓట్లు చీలిపోతే అధికారపార్టీకి అంత అడ్వాంటేజ్ అన్న విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. మరి కాంగ్రెస్ నియమించుకున్న వ్యూహకర్త సునీల్ ఎలాంటి మాయచేస్తారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: