పేర్నికి ‘పవర్’ పంచ్!

M N Amaleswara rao
ఏ రాజకీయ నాయకుడుకైన అధికారం వస్తే..ప్రజలకు మరింత మెరుగ్గా సేవలు చేయాలి...ప్రజలని ఆదుకోవాలి..వారికి అండగా ఉండాలి...మరి అధికారంలో ఉండే నాయకులు అదే పనిచేస్తున్నారా? అంటే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ వాళ్ళు మాత్రం పెద్దగా అలా పనిచేయడం లేదని ప్రతిపక్షాల నుంచే కాదు..ప్రజల నుంచి కూడా సమాధానం వచ్చే పరిస్తితి ఉంది..ఏదో రాజుల కాలంలో ఉన్నట్లు వైసీపీ నేతలు అధికారం చెలాయించడం, తాము చెప్పిందే వేదం..తాము చేసేది గొప్ప అన్నట్లు ముందుకెళుతున్నారు...అలాగే తమకు ఎవరైనా ఎదురుతిరిగితే వారి పరిస్తితి ఏం అవుతుందో చెప్పాల్సిన పని లేదు.

ఇక అధికారంతో ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టడం...కావాల్సిన వారికి పనులు చేయడమే తప్ప వైసీపీ నేతలు చేసేది ఏమి లేదని అంటున్నారు. వైసీపీ నేతలంతా అదే పనిలో ఉన్నారని...ఇక మంత్రులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు...ఏ మంత్రి ఏ శాఖ కోసం పనిచేస్తున్నారో తెలియదు గాని..వారు ప్రతిపక్షాలని తిట్టడం కోసం అయితే బాగా పనిచేస్తున్నారని చెప్పుకునే పరిస్తితి వచ్చింది.


ఇక తమని ఇబ్బంది పెడుతూ..అధికార బలం చూపిస్తున్న వారికి ఖచ్చితంగా నెక్స్ట్ ఎన్నికల్లో అధికారం లేకుండా చేస్తామని ప్రతిపక్షాలు అంటున్నాయి...ఇదే సమయంలో మంత్రి పేర్ని నానిని జనసేన శ్రేణులు గట్టిగా టార్గెట్ చేసేశాయి. అసలు పేర్ని సమాచార, రవాణా, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు..వాస్తవానికి ఈయన నిర్వహిస్తున్న శాఖలపై ప్రజలకు పెద్దగా అవగాహన లేదని చెప్పాలి...ఎందుకంటే ఈయన తన శాఖలకు సంబంధించి మాట్లాడటం కంటే..ఎంతసేపు చంద్రబాబు, పవన్‌లపై పంచ్‌లు వేయడంలోనే ముందున్నారు.

పైగా సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న పేర్ని..పవన్ కల్యాణ్ టార్గెట్‌గా ఎలాంటి రాజకీయం చేస్తున్నారో అందరికీ తెలిసిందే..అసలు టోటల్‌గా వైసీపీ ప్రభుత్వం, పవన్ సినిమాలని దెబ్బకొట్టాలని చూస్తున్నారని పవన్ అభిమానులు, జనసేన శ్రేణులు ఫైర్ అవుతున్నాయి..అందుకే పేర్నికి నెక్స్ట్ పవర్ లేకుండా చేస్తామని అంటున్నారు..నెక్స్ట్ మచిలీపట్నంలోనే ఓడిస్తామని మాట్లాడుతున్నారు. మరి చూడాలి నెక్స్ట్ పేర్నికి పవన్ ఫ్యాన్స్ పవర్ పంచ్ ఇస్తారో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: