భారతీయుల తరలింపుపై సోనూసూద్ స్పందన..!

NAGARJUNA NAKKA
ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపుపై నటుడు సోనూసూద్ స్పందించాడు. 18వేల భారతీయ విద్యార్థులు, కుటుంబాలు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయారు. వారిని వెనక్కి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తుందని తాను అనుకుంటున్నట్టు చెప్పారు. వారి తరలింపుకోసం ఉన్న అన్ని మార్గాలను అన్వేషించాలని కోరుతున్నట్టు చెప్పారు. అందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఉక్రెయిన్ లో ఇరుక్కుపోయిన తెలంగాణ విద్యార్థులను ఆదుకోవాలని మంత్రి కేటీఆర్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కు విజ్ఞప్తి చేశారు. భారత ప్రభుత్వం అక్కడికి స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ లను పంపించాలనీ.. అందుకు అయిన ఖర్చులను తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. దీని వల్ల విద్యార్థులు క్షేమంగా, వేగంగా స్వదేశానికి తీసుకురావచ్చని పేర్కొన్నారు. అయితే తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్టు ఉక్రెయిన్ తెలిపింది.
మరోవైపు ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో హైదరాబాద్ తో పాటు ఢిల్లీలో ఈ కేంద్రాలు పనిచేస్తాయి. ఢిల్లీ నెంబర్లు.. 7042566955, 9654663661. హైదరాబాద్ నెంబర్లు.. 040-23220603, 9440854433.
ఉక్రెయిన్ లో ఇబ్బందులు పడుతున్న తెలుగు విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం.. సరిహద్దు దేశాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసింది. 48660460814, 48606700105 నెంబర్లను అందుబాటులోకి తెచ్చామని.. ప్రతి విద్యార్థిని ట్రేస్ చేసి.. రోడ్డు మార్గంలో ఉక్రెయిన్ బోర్డర్ కు తీసుకొచ్చి.. అక్కడి నుంచి విమానాల్లో భారత్ కు తరలిస్తామని సీఎస్ సమీర్ శర్మ చెప్పారు. 1902కు కాల్ చేసి పేరెంట్స్ వారి పిల్లల సమాచారం తెలుసుకోవచ్చన్నారు. అటు ఏపీ విద్యార్థుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా హెల్ప్ లైన్ సెంటర్ ను ప్రారంభించింది. ఢిల్లీ నెంబర్లు.. 9871999055, 9871990081, 9871999430.
అంతేకాదు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారత ప్రజలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకమైన ఫ్లైట్లు నడపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వాటిలో ఉచితంగా మన దేశానికి తీసుకురానున్నట్టు సమాచారం. అయితే తమ ఎయిర్ స్పేస్ పై ఉక్రెయిన్ నిషేధం విధించింది. దీంతో మన వారిని పక్కదేశాలకు తరలించి.. అక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: