కర్ణాటక శివమొగ్గ లో ఉత్కంఠ...భజరంగ్ దళ్ నేత హత్యకు కారణం అతనే?

VAMSI
కర్ణాటకలో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియడం లేదు. గత కొద్ది రోజుల నుండి ఉడుపి జిల్లాలో చెలరేగిన హిజాబ్ వివాదం దేశాన్ని అట్టుడికించింది. ఇప్పటికే కొన్ని చోట్ల కొద్ది పాటు వివాదాలు జరుగుతున్నాయి. మరి ఈ వివాదం పై అధికారికంగా కోర్టులు ఏమి తీర్పును ఇస్తాయో అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇది రాజకీయంగా కావాలనే రేపిన రచ్చని కూడా వార్తలు వచ్చాయి. కానీ దేనికీ కూడా స్పష్టమైన ఆధారాలు లేవు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సమస్య కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతంలో వివాదాన్ని సృష్టిస్తోంది. ఇంతకీ అసలు విషయం ఏమిటో చూద్దామా,

తాజాగా భజరంగ్ దళ్ పార్టీకి చెందిన కార్యకర్త హర్షను  హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్య శివమొగ్గ ప్రాంతంలో చోటు చేసుకుంది. దీనితో ఆ ప్రాంతమంతా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ హత్యను రాజకీయ ప్రతీకార హత్యగా చిత్రీకరించే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే ఇక్కడ ప్రధానంగా బీజేపీ మరియు కాంగ్రెస్ మధ్యనే రాజకీయ వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ హత్య జరగడానికి కారణం కాంగ్రెస్ నేత పిసిసి చీఫ్ డికే శివ కుమార్ ఉన్నారని మంత్రి ఈశ్వరప్ప అనడంతో సమస్య జటిలంగా మారుతోంది. అయితే ఈ వ్యాఖ్యలను శివ కుమార్ తిప్పికొట్టారు. మంత్రి ఈశ్వరప్పకి పిచ్చి పట్టిందని అందుకే ఇష్టం వచ్చినట్లు వాగుతున్నాడని కౌంటర్ వేశారు. ఈ హత్యను రాజకీయ కోణంలో ఆలోచించకుండా దర్యాప్తు చేయించాలని సీఎం ను కోరారు.

కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఇలాంటి వాటిని ఎంకరేజ్  చేయదని హత్యకు కారణమైన వారిని ఉరి తీయాలని ఇప్పటికే ఆయన అన్నారు. ఈ హత్య కారణంగా పరిస్థితులు ఆలోచించిన ప్రభుత్వం శివ మొగ్గ లో ఈ రోజు విద్యాసంస్థలు అన్నింటికీ సెలవు ప్రకటించింది. ఈ విషయంపై కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై కూడా ఆవేశంగా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ హత్య పై ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశామన్నారు. వీలైనంత తొందరగా నిందితుడిని పట్టుకుంటామని చెప్పారు. అయితే పోలీసులు ఉన్నా కూడా శివ మొగ్గ ప్రాంతంలో కాషాయం శాలువాలు కప్పుకుని ఉన్నా కొందరు అక్కడ వాహనాలను కాల్చడం మరియు రాళ్లు వేయడం లాంటివి చేస్తున్నారు. ఈ కేసు విషయం ఎప్పటికి వీడుతోందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: