గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం... కరోనా డ్రాప్ అయింది?
ఇప్పటి వరకు కరోనా దశల వారీగా ప్రజలపై పడి చంపుతోంది. ప్రస్తుతం దేశంలో గత రెండు మూడు నెలల నుండి ఓమిక్రాన్ వేరియంట్ పేరుతో వచ్చి ఇబ్బంది పెడుతున్న వైరస్ కాస్త తగ్గుముఖం పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో కేసులు ఉన్నా కానీ ప్రాణాపాయం లేదని తెలియడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. డాక్టర్స్ తెలుపుతున్న సమాచారం ప్రకారం రోజు రోజుకీ కేసులు తగ్గిపోతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్న సమాచారం ప్రకారం నిన్న దేశం మొత్తం మీద వచ్చిన కరోనా కేసులు 16,051 మాత్రమే. అదే విధంగా కరోనా కారణంగా 219 మంది మరణించారని తెలిపారు.
అయితే ఇంతకు ముందు వరకు ఉన్న పరిస్థితితో పోల్చుకుంటే పాజిటివిటీ శాతం 1.93 కి పడిపోయినట్లు తెలిపారు. అయితే ప్రజలు నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటిలాగే కరోనా నిబంధనలు పాటించాలి అని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అంతే కాకుండా దేశం మొత్తం మీద ప్రస్తుతం కరోనా తో ఇబ్బంది పడుతున్న వరకు రెండు లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది.