పోలీస్ స్టేషన్ లో హల్ చల్ చేసిన ఎంపీ.. ఎందుకో తెలుసా?

praveen
సాధారణంగా ఏదైనా పదవిలో ఉండే రాజకీయ నాయకులు ఎంతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రసంగం  ఇచ్చే టైం లో మాత్రమే కాదు.. వారి నడవడిక వ్యవహార శైలి కూడా ఎంతో హుందాగా నే   ఉండాలి.  ఇక ఇలా ఒక ఉన్నతమైన పదవిలో కొనసాగుతున్న రాజకీయ నాయకులు హుందాగా ప్రవర్తించకపోతే తీవ్ర స్థాయిలో విమర్శలు పాలుకావడం ఖాయం. ఇలా ఇప్పటి వరకూ ఎంతోమంది రాజకీయ నాయకులు చిత్ర విచిత్రంగా ప్రవర్తించింది విమర్శలను ఎదుర్కొన్న వారు ఉన్నారు.


 అయితే కొన్ని కొన్ని సార్లు ఇక ప్రజా ప్రతినిధులుగా కొనసాగుతున్నారు పోలీసులపై నోరు పారేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇటీవలే ఇలాంటి ఘటనే జరిగింది. విజయవాడ కృష్ణ లంక పోలీస్ స్టేషన్లో మంగళవారం అర్ధరాత్రి సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ నందిగం సురేష్ హల్ చల్ చేసిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పార్లమెంటు సభ్యుడు సురేష్ తో పాటు ఆయన అనుచరులు కూడా పోలీస్ స్టేషన్లో  దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఒక హోటల్ వద్ద రాష్ డ్రైవింగ్ చేస్తున్న యువకులను పోలీసులు గమనించి పట్టుకుని స్టేషన్ కి తీసుకెళ్లారు.


 అయితే తాము అధికార పార్టీ పార్లమెంటు సభ్యుడు నందిగామ సురేష్ అనుచరులం అంటూ ఆ యువకులు పోలీస్ స్టేషన్లో హంగామా సృష్టించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఎంపీ నందిగామ సురేష్ వెంటనే పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే తన అనుచరులను అరెస్టు చేయడంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఎంపీ సురేష్ ఏకంగా పోలీసులతో బాహాబాహీ దిగే పరిస్థితులు తలెత్తినట్లు తెలుస్తోంది. అదే సమయంలో అటు స్టేషన్ ఎస్.ఐ తో ఎంపీ అనుచరులు కూడా వాగ్వాదానికి దిగారు. ఇక అక్కడే పక్కనే ఉండి వీడియో తీస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ పై కూడా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది  ముందుగా వీడియో తీస్తున్న కానిస్టేబుల్ చేతిలో నుంచి ఫోన్ లాక్కుని బయటకు వెళ్లారు ఎంపీ అనుచరుల. ఫోన్ తీసుకునెందుకు బయటకు వెళ్ళగా అతనిపై  దాడి చేశారు. ఇక ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన యువకుల్లో ఎంపీ సురేష్ సమీప బంధువు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా పార్లమెంటు సభ్యుడు స్థానంలో ఉండి ఎంపీ సురేష్ ఇలా ప్రవర్తించడం మాత్రం ఆంధ్రా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: