విజయవాడలో చిచ్చురేపిన హిజాబ్ వివాదం...

VAMSI
దేశంలో మతాల పేరిట జరిగే విద్వేషాలు ప్రజలకు ఎంత నష్టాన్ని కలిగిస్తాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సినఅవసరం లేదు. మన దేశ చరిత్రలో ఇలా ఎన్నో జరిగాయి. అయితే తరాలు మారుతూ కొంచెం యువతలో మార్పులు వస్తూ దేశం అభివృద్ధి పధంలో నడుస్తోంది. అయినా ఎక్కడో చిన్న చిన్న మత గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కానీ గత కొద్ది రోజుల ముందు కర్ణాటకలోని ఉడుపి జిల్లా లో ఒక కాలేజ్ లో జరిగిన సంఘటన మళ్ళీ మత గొడవలను రెచ్చగొట్టేదిలా మారింది. కాలేజీ ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ధరించి రావడంతో కొందరి స్టూడెంట్స్ ను కాలేజీ లోకి అనుమతించలేదు. దీనితో ఈ విషయం అలా పాకి దేశ వ్యాప్తంగా సంచలనముగా మారింది.

అయితే దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. దీనికి విరుద్ధంగా హిందువులు కూడా కాషాయం టవల్ ను పైన వేసుకుని రావడంతో అది కాస్తా హిందూ ముస్లిం మత గొడవల మారిపోయింది. ప్రస్తుతం ఈ విషయం కర్ణాటక హై కోర్ట్ లో ఉంది. కాగా ఇప్పుడు ఈ హిజాబ్ గొడవ మన ఏపీకి కూడా పాకింది. విజయవాడ లోని లయోలా కాలేజీ లో కొందరు విద్యార్థులు హిజాబ్ ధరించి రావడంతో వారిని లోపలకు అనుమతించలేదు. దీనితో ఆ విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి ఎంత వివరిస్తున్నా వారు ఒప్పుకోకపోవడంతో ముస్లిం మత పెద్దలు సీన్ లోకి ఎంటర్ అయిపోయారు.

నిన్న మొన్నటి వరకు సదరు విద్యార్థులు ఇలాగే వచ్చినా పట్టించుకోని కాలేజ్ ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారంటూ వారు అడుగుతున్నారు. అయితే ముస్లిం మత పెద్దలు కాలేజీ వారితో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం ఇంతటితో సమసిపోతే ఓకే... కానీ పెద్దది అయితే మాత్రం హింస ఒక రేంజ్ లో జరుగుతుంది అని చెప్పాలి. ఈ విషయం ఎంత దూరం వెళుతుందో తెలియాలంటే ఇంకా కాస్త సమయం వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: