హిజాబీపై కీలక వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్..!

NAGARJUNA NAKKA
కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై ఏఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఏదో ఒక రోజు ఒక హిజాబీ దేశ ప్రధాన మంత్రి అవుతారన్నారు. తాను బతికున్నా.. లేకున్నా ఇది జరుగుతుందన్నారు.హిజాబ్ ధరిస్తానని.. ఆడపిల్లలు తమ పేరెంట్స్ తో అంటారనీ.. అందుకు పేరెంట్స్ కూడా అంగీకరిస్తారని చెప్పారు. ఆడపిల్ల హిజాబ్ ధరించిన వైద్యురాలు.. కలెక్టర్ వ్యాపార వేత్త కూడా అవుతుందన్నారు.

ఇక నుదుటన సింధూరం పెట్టుకోవడం తన వ్యక్తిగత స్వేచ్ఛ అయినప్పుడు. హిజాబ్ ధరించడం ముస్లిం యువతి వ్యక్తి గత స్వేచ్ఛ అవుతుందన్నారు ఎమ్మెల్సీ కవిత. ఓ హిందీ పద్యాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె.. ఎలా ఉండాలి.. ఏం ధరించాలి.. అనే విషయాలను మహిళ ఇష్టాఇష్టాలకే వదిలేయాలని సూచించారు. ఏది ధరించినా మన గుర్తింపు భారతీయతే అవుతుందన్నారు. మహిళలకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందన్నారు.

ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం హిజాబ్ వివాదంపై స్పందించారు. రాయగిరి సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఐటీ రంగంలో భారతదేశానికి కర్ణాటకలోని బెంగళూరు నగరం సిలికాన్ వ్యాలీ అనీ..పసికూనలైన ఆడబిడ్డలపైన రాక్షసుల్లాగా ప్రవర్తించవచ్చునా అని మండిపడ్డారు. సిలికాన్ వ్యాలీలో మతపిచ్చి లేపి కాశ్మీర్ వ్యాలీగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా ఘటనలు జరిగితే ఎవరైనా పెట్టుబడులు పెడతారా.. ఉద్యోగాలు వస్తాయా అని కేసీఆర్ అన్నారు.

అయితే కర్ణాటకను కుదిపేస్తున్న హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగానే కాకుండా.. అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. ఇటీవల కొందరు విదేశీ ప్రముఖులతో పాటు కొన్ని దేశాలు కూడా దీనిపై స్పందిస్తూ వ్యాఖ్యలు చేశాయి. దీంతో ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ అంతర్గత విషయాలపై రెచ్చగొట్టే కామెంట్లు చేయడం తగదని సూచించింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.










మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: