కేసీఆర్ ‘షో’ స్టార్ట్?
ఆ తర్వాత నుంచి కేసీఆర్ షో కొనసాగుతూనే ఉంది...ప్రతిపక్షాలని ఎక్కడకక్కడే వీక్ చేస్తూ వచ్చిన కేసీఆర్..2018 ఎన్నికల్లో కూడా వన్ మ్యాన్ షో నడిపించేశారు. ప్రత్యర్ధులంతా ఏకమైన సరే...కేసీఆర్ ఒక్కరే పొరాడి సత్తా చాటారు. ఒంటిచేత్తో టీఆర్ఎస్‌ని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేశారు. అలా కేసీఆర్ రెండు సార్లు టీఆర్ఎస్‌ని అధికారంలోకి తీసుకొచ్చారు.
అయితే రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా కేసీఆర్ హవా కొనసాగుతూనే ఉంది...కాకపోతే గత ఏడాది నుంచి సీన్ మారిపోయింది...అనూహ్యంగా తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ రేసులోకి వచ్చింది..పైగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌ని రెండు ఉపఎన్నికల్లో మట్టికరిపించింది. దీంతో టీఆర్ఎస్‌కు పోటీగా బీజేపీ వచ్చేసింది..అలాగే కేసీఆర్‌కు చెక్ పెట్టే సత్తా బీజేపీకే ఉందనే ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో మొదలైంది..ఆ దిశగానే రాజకీయం నడుస్తోంది. కానీ ఇలా బీజేపీ హవా పెరుగుతుంటే కేసీఆర్ చూస్తూ ఊరుకోరు కదా..అందుకే తన గేమ్ మళ్ళీ మొదలుపెట్టారు.
ఎప్పటిలాగానే సెంటిమెంట్ అస్త్రాన్ని తెరపైకి తీసుకొచ్చారు..అలాగే మోదీని తెలంగాణ విలన్‌గా చూపించి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారు. గతంలో చంద్రబాబుని విలన్‌గా చూపించి గెలిచారు...ఇప్పుడు మోదీని టార్గెట్ చేశారు. ఇలా కేసీఆర్ రాజకీయం మొదలుపెట్టడంతో టీఆర్ఎస్ తప్పిదాలు...ఎమ్మెల్యేలపై ఉన్న ప్రజా వ్యతిరేకత లాంటి అంశాలు పక్కకు వెళ్లిపోయాయి. కేవలం కేసీఆర్ మాటలపైనే చర్చ నడుస్తోంది...అంటే మళ్ళీ కేసీఆర్ షో మొదలైంది...మరి చూడాలి తన వన్ మ్యాన్ షోతో కేసీఆర్ టీఆర్ఎస్‌ని అధికారంలోకి తీసుకొస్తారేమో.