యాదాద్రి ఆలయం ప్రారంభమైతే ఏం జరుగుతుందో తెలుసా..!

NAGARJUNA NAKKA
యాదాద్రి ఆలయం ప్రారంభమైతే అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని.. యాదాద్రి కూడా హైదరాబాద్ లో కలిసిపోతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్-వరంగల్ అద్భుతమైన కారిడార్ గా అభివృద్ధి చెందుతుందన్న సీఎం.. భువనగిరిలో ఇప్పుడు ఎకరా భూమి విలువ 2 నుంచి 3కోట్ల వరకు ఉందన్నారు. మారుమూల ప్రాంతాల్లోనూ 25 లక్షల నుండి 30లక్షలకు పైనే ధరలు ఉన్నాయన్నారు. యాదాద్రి జిల్లా ఏర్పాటును ఎవరూ ఊహించలేదన్న సీఎం.. ఉమ్మడి ఏపీలో జిల్లా ఏర్పాటు కోరినా సాధ్యపడలేదన్నారు.

అంతేకాదు రాష్ట్రం అద్భుత ప్రగతి సాధిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. మిషన్ కాకతీయ వల్ల భూగర్భ జలాలు పెంచామనీ.. దీని వల్ల మారుమూల ప్రాంతాల్లోనూ భూముల ధరలు పెరిగాయన్నారు. ఎక్కడా ఎకరం భూమి 25లక్షలకు తక్కువ లేదని.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంపద పెరిగిందని సీఎం అన్నారు. యాదాద్రి కలెక్టరేట్ ను ప్రారంభించిన తర్వాత మాట్లాడిన సీఎం ఏపీని ఉద్దేశిస్తూ పరోక్షంగా పలు విమర్శలు చేశారు. తమకు పరిపాలన చేతకాదని.. కరెంట్ ఉండదని గత పాలకులు విమర్శించారు. ఒక సీఎం అయితే తెలంగాణకు కరెంట్ రాదని కట్టెతో మ్యాప్ చూపించారు. ఇప్పుడు అలా చూపించిన వాళ్ల రాష్ట్రంలోనే కరెంట్ లేదు. మన దగ్గర 24గంటల కరెంట్ ఉందన్నారు కేసీఆర్. మన గ్రామాలను చూసి దేశం అబ్బురపడుతోందన్నారు సీఎం.

ఇక కేంద్రంలోని బీజేపీ విధానాలతో ఎవరూ బాగుపడలేదని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎనిమిదేళ్ల పాలనలో బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేసిందన్నారు. మోడీ పాలనలో ఎవరికీ నయాపైసా పని జరగలేదన్నారు. దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరగలేదా..16లక్షల పరిశ్రమలు మూతపడలేదా.. 140కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో మత పిచ్చి అవసరమా.. కుల, మత, జాతి బేధం లేకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అమెరికా లాంటి దేశాల్లో మత పిచ్చి ఉండదన్నారు. అందుకే అక్కడ అభివృద్ధి అని కేసీఆర్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి నాయకులు చేసిన వ్యాఖ్యలనూ గుర్తు చేశారు.














మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: