కేటీఆర్: కేసీఆర్ ను ఎగతాళి చేసినా సాధించాడు...
అలాగే ప్రత్యర్థులకు దీటైన కౌంటర్లు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇచ్చేస్తుంటారు. అదే విధంగా అంతకు మించి ఎలాంటి ప్రజా సమస్యల నైనా ఈ సోషల్ మీడియా వేదికపైనే పరిష్కరించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే చాలా తక్కువ సమయంలోనే ప్రజలకు చేరువయ్యాడు. ఈ మధ్య స్పెషల్ గా ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు అలాగే పరిష్కారం కొరకు ఈ వేదికపై #askktr అనే ప్రోగ్రాం ని కూడా స్టార్ట్ చేసారు.
ఇది ఇలా ఉండగా కేటిఆర్ తెలంగాణ సిఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తున్న వాళ్లకు సోషల్ మీడియా ట్విట్టర్ లో రీ కౌంటర్ ఇస్తూ ఘాటుగానే స్పందించారు. 2001 సంవత్సరాన్ని కనుక ఒకసారి గుర్తు చేసుకుంటే... మే నెలలో సింహ గర్జన సభలో కేంద్రాన్ని సరైన దారిలో పెట్టి… తెలంగాణ రాష్ట్రాన్ని ఖచ్చితంగా తీసుకొస్తామని అప్పట్లో కేసీఆర్ మనస్పూర్తిగా చేసిన వ్యాఖ్యలను సైతం అప్పటి రాజకీయ నాయకులు హేళన చేసి మాట్లాడారు. అయితే ఇవన్నీ పట్టించుకోని కేసీఆర్ సరైన ప్రణాళికతో కేంద్రంతో పోట్లాడి ప్రత్యేక తెలంగాణను సాధించాడు అని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఈ విషయానికి సంబంధించిన అప్పటి సాక్ష్యం ఈనాడు పేపర్ ను ట్విట్టర్ వేదికగా షేర్ చేసాడు. ఇది ఎపుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.