"ప్రత్యేక హోదా": జగనోరి దెబ్బకు బాబోరు బెంబేలు.

VAMSI
ఒకటిగా ఉన్నా తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ కాస్త రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయి ఒక రాష్ట్రానికి తెలంగాణ రూపకరణం చేసిన విషయం విదితమే. కాగా విభజన సమయంలో పలు సమస్యలు రెండు రాష్ట్రాల మధ్య చోటు చేసుకున్నాయి. నీటి వనరులు, ఆర్ధిక సంపద, దేవాలయాలు, పంపకాలు, ఉమ్మడి రాజధాని ఇలా పలు సంస్థలు తలేత్తగా... కొన్నిటికి ఇప్పటికీ పరిష్కారం లభించలేదు. అప్పుడప్పుడు ఈ సమస్యల కారణంగా తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సమస్యలకు పరిష్కారం తీసుకొచ్చి రెండు రాష్ట్రాల మధ్య మరింత సాన్నిహిత్యం పెంచే విధంగా నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్ర హోం శాఖ ఓ కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది.

ఈ సమావేశం లో విభజన సమయంలో వచ్చిన సమస్యలన్నిటినీ ఒక కొలిక్కి తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.  ఈ సమావేశానికి ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు సైతం హాజరు కానున్నారు. ఇక ఈ సమావేశం ఫిబ్రవరి 17 న ఉదయం 11 గంటలకు తొలి భేటీ జరగనుంది. విభజన చట్టం షెడ్యుల్ 9,10 లోని ఆస్తుల పంపకాల పైన కూడా చర్చలు  జరగబోతున్నాయి అని సమాచారం. ఈ సమావేశంలో విద్యుత్ కు సంభందించిన కీలక అంశాలు, ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, వనరుల సర్దుబాటు, పన్ను, ప్రత్యేక హోదా వంటి పలు కీలక అంశాలు ప్రధాన అంశాలుగా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే నిన్న మొన్నటి వరకు జగన్ కేవలం సంక్షేమ పథకాలపైనే తన దృష్టిని కేంద్రీకరిస్తున్నాడని విమర్శలు చేస్తూ వచ్చిన ప్రతిపక్ష మరియు ఇతర వైసీపీ వ్యతిరేక పార్టీలు మరియు నేతలు ఈ విషయం తెలియడంతో షాక్ తింటున్నారు. ముఖ్యంగా బాబోరు ఈ షాక్ నుండి తేరుకోవాలంటే ఇంకా కొన్ని రోజులు పడుతుంది. ఇక ఈ విషయం కాస్తా అయిపోతే జగన్ ను విమర్శించడానికి ఇంకేమి దొరుకుతుంది అని బాబోరు వెతుక్కునే పరిస్థితి తీసుకు వచ్చాడు. ప్రభుత్వంలో అన్ని అంశాలు పరిశీలనలో ఉంటాయి. సమయాన్ని బట్టి అన్నీ పరిష్కారం అవుతాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పాలి. ఇప్పుడు జగన్ పాలనతీరు మరియు కేంద్రంతో తనకు ఉన్న రిలేషన్ అర్ధమవుతుంది. అయితే అనుకున్నట్లుగా ఈ సమావేశంలో ప్రత్యేక హోదా అంశంపై మంచి నిర్ణయం రావాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: