దారుణం: ఢిల్లీలో భవనము కూలి 4 మృతి...

VAMSI
మనకు తెలియకుండానే కొన్ని విషాదకర ఘటనలు జరుగుతూ ఉంటాయి. కానీ కొన్ని ఘటనలు ప్రాణ నష్టం ఏమీ కలుగకుండా జరుగుతాయి. మరి కొన్ని మాత్రం ప్రాణాలను సైతం తీసుకుంటూ ఉంటాయి.  అలాంటి ఒక ఘటనే ఉత్తర ఢిల్లీలో ఉన్న బవానా ప్రాంతంలో ఓ భవనం హఠాత్తుగా కూలిపోయింది.  ఈ రోజు మధ్యాహ్నం ఈ ప్రమాదం జరగగా... 2.48 గంటల సమయంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని హుటా హుటిన సహాయక చర్యలు మొదలు పెట్టారు. కుప్పకూలిన భవనంలో దాదాపు 400 ప్లాట్లు వరకు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఘటన లో ఇప్పటి వరకు చూస్తే ఈ ప్రమాదం కారణంగా 4 వ్యక్తులు చనిపోయినట్లు సమాచారం. అయితే కొందరు తీవ్ర గాయాల పాలయ్యారు అని తెలుస్తోంది. భవనం కింద చిన్నారులు, మహిళలు కూడా ఉండటం విషాదకరం.

ఇప్పటికే కొందరు చిన్నారులు,  ఐదుగురు శిధిలాల కింద దొరికినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు మహిళలను ప్రాణాలతో రక్షించి హాస్పిటల్ కు తరలించారు. వారు ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు. కూలిన భవనంలో దాదాపు 300 నుంచి 400 వరకు ప్లాట్లు ఉన్నాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది, కొందరు అంబులెన్స్ సిబ్బంది మరియు జేసిబిలతో అందరూ కలిసి ప్రమాదం లో చిక్కుకున్న వ్యక్తులను రక్షించే ప్రయత్నం లో నిమగ్నులై ఉన్నారు. అందరినీ ప్రమాదం నుండి కాపాడటానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు.

అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఆ సమయంలో ఎంత మంది ప్లాట్ లలో ఉన్నారు అన్న వివరాలు తెలియాల్సి ఉన్నాయి. కాగా ఈ విషయం గురించి తెలుసుకున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తెలుసుకుంటున్నారట. ఈ ఘటనలో గాయాలు పాలయిన అందరూ వీలైనంత తొందరగా కోలుకోవాలని ప్రార్ధిద్దాం .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: