కేసీఆర్‌ జనగామ టూర్‌.. బండి సంచలన ప్రకటన ?

Veldandi Saikiran
కేసీఆర్‌ జనగామ టూర్‌.. బండి సంచలన ప్రకటన ?

కేసీఆర్ జనగాం జిల్లాకు వెళుతున్నారని బీజేపీ కార్యకర్తలను రెండ్రోజులుగా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం అన్యాయమన్నారని బండి సంజయ్‌ ఫైర్‌ అయ్యారు. ‘‘వాళ్లేమైనా ఉగ్రవాదులా? నిషేధిత సంస్థ సభ్యులా? సీఎంకు బీజేపీ కార్యకర్తలంటే ఎందుకంత భయం? రెండ్రోజులుగా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడమేంది?  తీవ్రవాదులకు మద్దతిచ్చే పార్టీల నాయకులు యధేచ్చగా తిరుగుతుంటే వారికి వత్తాసు పలుకుతూ ఆ  పార్టీ నేతల చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న కేసీఆర్ జనం కోసం పోరాడే బీజేపీ కార్యకర్తలను నిర్బంధాలకు గురిచేయడమేంది? పోలీసులను అడ్డం పెట్టుకుని ఇంకెన్నాళ్లు పాలన కొనసాగిస్తారు?’’అంటూ బండి సంజయ్  మండిపడ్డారు.  టీఆర్ఎస్ గూండాల దాడిలో గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించడానికి వెళుతుంటే బీజేపీ ఫ్లోర్ లీడర్ రాజాసింగ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు లను హౌజ్ అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బండి సంజయ్ ఖండించారు. ‘‘ పోలీసుల సమక్షంలోనే బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ గూండాలు దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నారు. డీజీపీ, పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.  


మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నిజాం నిరంకుశ పాలనలో ఉన్నామా... అర్ధం కాక ప్రజలు ఆందోళన చెందే పరిస్థితి నెలకొంది. మహోజ్వలిత పోరాటమైన తెలంగాణ ఉద్యమంలోనూ ఇట్లాంటి పరిస్థితిని చూడలేదు.  ఇట్లాంటి దుస్థితి మరే రాష్ట్రంలో లేదు’’అని దుయ్యబట్టారు.  ఒకప్పుడు పోలీసులకు దేశవ్యాప్తంగా మంచి పేరుండేదని, కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆ పేరును చెడగొట్టారని మండిపడ్డారు. కొంతమంది పోలీసులైతే ఏకంగా టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని... చివరకు పోలీసు వాహనాలకు సైతం టీఆర్ఎస్ జెండాలను పెట్టుకు తిరుగుతుండటం నీచాతినీచమని వ్యాఖ్యానించారు. ఎంతమందిని అరెస్టు చేసినా... మరెన్ని దాడులు చేసినా బీజేపీ కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదన్నారు. నక్సలైట్లకు ఎదురొడ్డి నిలబడ్డ పార్టీ బీజేపీ అనే సంగతి కేసీఆర్ గుర్తుంచుకోవాలని తెలిపారు. తక్షణమే అరెస్టు చేసిన కార్యకర్తలందిరినీ బేషరతుగా విడుదల చేయాలని, దాడులకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జరగబోయే పరిణామాలకు ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాలని హెచ్చరించారు



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: