ప్రధాని మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు...

VAMSI
మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా పచ్చగా 23 జిల్లాలతో కళకళలాడుతూ ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని కాస్త కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ విడదీసి వెళ్లిన తీరు ఎన్నటికీ ఏపి ప్రజలు మరిచిపోలేరు. ఏపిని రెండు ముక్కలుగా చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటూ రెండు రాష్ట్రాలుగా విడ దీసిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశం తెలంగాణ ప్రజలకు సంతృప్తిని ఇచ్చి ఉండొచ్చు. కానీ ఆంధ్రులు మాత్రం ఈ విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే తాజాగా దేశ ప్రధాని మోదీ వ్యాఖ్యలు కూడా ఆంధ్రుల గళానికి తోడైనట్లుగా ఉన్నాయి. దాంతో తెలంగాణ రాజకీయ వేత్తలు అందుకు అభ్యంతరాలు తెలుపుతూ ప్రశ్నల వర్షాలు కురిపిస్తున్నారు.

ఇదెక్కడి న్యాయం , ఇలా మాట్లాడటం మాకు బాధాకరమే కాదు తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన అమర వీరుల త్యాగానికి కూడా  అర్దం లేకుండా పోతుంది. రాష్ట్ర విభజనపై రాజ్య సభలో దేశ ప్రధాని మోదీ గారు చేసిన వ్యాఖ్యలపై వ్యతిరేకిస్తూ అసంతృప్తిని వ్యక్తం చేశారు తెలంగాణ మంత్రి హరీష్‌ రావు. ఈ విషయంపై మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ  మోదీ వ్యాఖ్యలు చూస్తుంటే తెలంగాణను మళ్ళీ ఏపిలో కలిపేందుకు ఆలోచిస్తున్నట్లు ఉంది. ఆయన మాట తీరు చూస్తుంటే తెలంగాణ పై అక్కసు వెళ్లగక్కుతున్నట్లు స్పష్టమవుతోంది అంటూ ఘాటుగా స్పందించారు.

ఈ విషయంలో మోదీ గారి వ్యాఖ్యలు ఇక్కడి బిజెపి నేతలకు సంతోషాన్ని కలిగిస్తున్నాయేమో కానీ మా మనసులకు మాత్రం తీవ్రంగా గాయాన్ని కలిగించేలా ఉన్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  కావాలనే దేశ ప్రధాని తెలంగాణ పై విషం వెదజల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు మంత్రి హరీష్ రావు. ఇలా మోదీ వ్యాఖ్యలు ఇంకెంత గందరగోళాన్ని సృష్టిస్తాయో తెలియడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: