పెరగనున్న పెట్రోల్ డీజిల్ ధరలకు కారణం అదేనా... ?

VAMSI
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ రోజున నిత్యావసర వస్తువుల ధరలు చూస్తే ఏ విధంగా ఉన్నాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పొద్దున్నే తీసుకునే పాలు నుండి ఆఫీస్ కు వెళ్ళడానికి వాడే పెట్రోల్, డీజల్ వరకు అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా ఇంధన ధరలు పెరగడం అనేది సామాన్యులపై పిడి గుద్దు అని చెప్పాలి. ఎక్కడ చూసినా బైక్, కార్ లతో నిండిపోయి ఉన్న ఈ దేశంలో పెట్రోల్ డీజల్ వాడకం భారీగా పెరిగింది. అయితే ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకుని ప్రజలు ధరలను పెంచి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.

అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలలో పెరుగుదల ఉన్నప్పటికీ, ఇక్కడ మాత్రం పెంచడం లేదు. ఒకవేళ పెంచితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ఒక భయం. అందుకే గత కొన్ని రోజులుగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఏ మాత్రం మార్పు లేకుండా కొనసాగుతున్నా మరికొన్ని రోజుల్లో భారీగా పెరుగుతాయని తెలుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు, ప్రస్తుతం 5 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే  ఆయా రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకోవడానికి పెట్రోల్ డీజల్ ధరలను పెంచకుండా స్థిరంగా ఉంచారు.

ఒక్కసారి ఈ ఎన్నికలు కనుక ముగిశాయంటే మళ్ళీ యధావిధిగా ఎన్డీయే దెబ్బ ఏమిటో చూపిస్తుంది అని తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు డెలాయిట్ ఎం ఇ యు. ఎల్ ఎల్ పి సంస్థ పార్టనర్ దేబాశిష్ మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఎంతవరకు పెరుగుతుంది అనే విషయం కూడా ఈయన చెప్పడం విశేషం. ఎన్నికలు పూర్తి అయ్యాక దాదాపు ఒక లీటర్ ధరలో 8 రూపాయలు పెరిగే అవకాశం ఉంది అని తెలుస్తోంది.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: