గుడ్ న్యూస్: కరోనా నివారణకు నాజిల్ స్ప్రే...

VAMSI
కరోనా ఉదృతంగా ఉన్న సమయంలో ఈ మహమ్మారిని అరికట్టేందుకు వ్యాక్సిన్ ల వేట మొదలయ్యింది. ఆ టైం లో పలు రకాల వ్యాక్సిన్ సంస్థలు, ఆయుర్వేదిక్ సంస్థలు, ఇలా అంతా కరోనాకు చెక్ పెట్టే ఔషదం కోసం పరుగులు తీశారు. చివరికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి కరోనాను అడ్డుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించింది. అయితే కరోనా వచ్చిన వారి పరిస్థితి ఏమిటి..?? వైరస్ విషమిస్తే ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని హాస్పిటల్ కు పరుగులు తీయాల్సిందేనా..!! అన్న తరుణంలో ఆ మధ్య కరోనా కు చెక్ పెట్టే నాజిల్ స్ప్రే గురించి విన్నాం. అయితే ఇపుడు తాజాగా ఈ నాజిల్ స్ప్రే మన దేశం లోనూ అందుబాటులోకి వచ్చాయి.
శానోటైజ్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకొని మన దేశంలో  ఫాబిస్ప్రే ను అందుబాటులోకి తీసుకు రావడం జరిగింది. ఈ స్ప్రే ను తీసుకున్న కేవలం రెండు నిమిషాల్లోనే ప్రభావం చూపుతాయని అలాగే 24 గంటల్లోనే ప్రభావవంతంగా పని చేస్తూ వైరస్ ను తగ్గిస్తుందని నిపుణులు తమ అధ్యయనం ద్వారా వివరించారు. ఈ స్ప్రే చాలా సురక్షితమని నిర్దారించారు. క్లినికల్ ట్రైల్స్ సమయంలో ఈ స్ప్రే మంచి ఫలితాలను ఇవ్వడంతో తమ అధ్యయనాన్ని ముందుకు తీసుకెళ్లి సక్సెస్ అయినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ నైట్రిక్ ఆక్సైడ్ నాజిల్ స్ప్రే ను తయారు చేయడం, అలాగే మార్కెటింగ్ చేయడం కొరకు ఫార్మా కంపెనీకి భారత్ డ్రగ్ రెగ్యులేటరీ డిసిజీఐ అనుమతులు ఇచ్చింది.
సీనియర్  విపి డాక్టర్ మోనికా ఈ అంశం గురించి మాట్లాడుతూ ఈ స్ప్రే వేగంగా సురక్షితంగా పనిచేస్తుందని తెలిపారు.  ఇది కరోనా సోకినా పేషెంట్ ను కాపాడుతుందని తెలిపారు. ప్రస్తుతం ఇండియాలో వివిధ రకాల కరోనా వేరియంట్ లు ప్రజలను భయకంపితులను చేస్తున్న క్రమంలో ఈ నాజిల్ స్ప్రే సేఫ్ అని తెలుస్తోంది. ఈ స్ప్రే ల వలన 99 శాతం ప్రమాదం ఏమీ ఉండదని కోలుకుంటారని వారు తెలియచేస్తున్నారు. ఈ స్ప్రే ముఖ్యంగా పెద్దలకు ఉపయోగపడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: