కేసీఆర్ కు షాక్ ఇచ్చిన మునిసిపల్ చైర్మన్...

VAMSI
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటి నుండే వారి వారి స్థాయిలో రాజకీయ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి రోజు రోజుకి ప్రజలలో ఆదరణ కోల్పోతోందని రాజకీయ ప్రముఖులు అంటున్నారు. అయితే దీనికి కారణాలు ఏమైనా ఉండొచ్చు. కానీ వాస్తవం అయితే కేసీఆర్ ఈ మధ్య చేస్తున్న మరియు తీసుకుంటున్న కీలక నిర్ణయాలు తనకు చెడును కలిగిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మొన్ననే అంబేద్కర్ రచించిన భారత రాజ్యంగాన్ని మార్చాలని చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే ప్రతిపక్షం మరియు ఇతర పార్టీల నేతల ద్వారా విమర్శలను ఎదుర్కొంటూ ఉన్నారు.

కానీ దీనికి ఇప్పటికి కూడా ఏ విధమైన స్పదన ఇవ్వక పోవడం గమనార్హం. అయితే తెరాస శ్రేణుల నుండి తెలుస్తున్న సమాచారం ప్రకారం కేసీఆర్ కావాలని ఆ ఉద్దేశ్యంతో అనలేదని కవర్ చేసే ప్రయత్నం చేసినా అవేమీ ప్రతిపక్షాలను సంతృప్తి పరచలేకపోయాయి. ముఖ్యంగా బీజేపీ కేసీఆర్ పై గ్యాప్ లేకుండా  విరుచుకు పడుతోంది. దీనితో తెరాస లో కొంచెం ఉత్సాహం తగ్గినట్లు కనిపిస్తోంది. స్థాయిక నాయకులలో కూడా తెరాస పై నమ్మకం పోతోంది. అందుకు నిదర్శనమే తాజాగా జరిగిన ఒక సంఘటన. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మునిసిపల్ చైర్మన్ తెరాస కు బిగ్ షాక్ ఇచ్చారు. గతంలో ఒక స్వతంత్ర్య అభ్యర్థిగా స్థానిక ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందాడు మధు మోహన్.

కానీ ఆ తర్వాత తెరాస లోకి వెళ్లడం జరిగింది. నేడు మధు మోహన్ తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్ ఛుగ్ నుండి కండువాను అందుకు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇక్కడ బండి సంజయ్ మరియు ఇతర బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. ఇది నిజంగా అధికార పార్టీ తెరాస కు ఒక షాక్ అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: