హైదరాబాద్ శివారు ప్రాంతంలోని శంషాబాద్ సమీపంలో ఉన్న ముచ్చింతల్ లో ఆధ్యాత్మిక శోభ విరాజిల్లుతున్నది. ఇక్కడికి తెలంగాణతోపాటుగా పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలివస్తున్న భక్తులు 216 అడుగులు ఉన్నటువంటి శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని దర్శించుకొని మై మరిచిపోతున్నారు. ఈ కథంతా శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో కొనసాగుతున్నది. దీనికి దాదాపు ఐదు వేల మంది రూతివిజులు యాగశాలలో హోమాలు నిర్వహిస్తున్నారు. శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజున కార్యక్రమాలు అత్యంత ఆధ్యాత్మికంగా మొదలయ్యాయి అని చెప్పవచ్చు.
ఉదయం 6 గంటల 30 నిమిషాలకు అష్టాక్షరి మంత్ర పటణం జరగగా, 7.30 పెరుమాల్ ప్రాంత కాల ఆధారణ జరిగినది. ఇక 9 గంటల నుంచి శ్రీ లక్ష్మీ నారాయణ మహాయజ్ఞం మొదలైనది. దీని తర్వాత ఉదయం 10 గంటలకు ఐశ్వర్య ప్రాప్తి కై , సంతాన ప్రాప్తికై వైనతేయ ఇష్టి. అలాగే 10 గంటల 30 నిమిషాలకు యాగశాలలో విద్యార్థుల విద్యాభివృద్ధి పెద్దల యొక్క మనోవికాసానికి హాయగ్రీవ పూజ.. ఈరోజు సహస్రాబ్ది ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలు. అయితే ఈ ఉత్సవాలను తిలకించడానికి మంగళవారం కేంద్ర మంత్రి అమిత్ షా కూడా వచ్చారు. కానీ ఈ రోజు ముచ్చింతల్ లోని సమతా మూర్తి రామానుజాచార్యుల విగ్రహాన్ని దర్శించుకోవడానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, అలాగే భయ్యాజీ జోషి కానున్నారు.
మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకు ముచ్చింతల్ కు చేరుకొని దర్శనం చేసుకోనున్నారు. అలాగే రాత్రి ఎనిమిది గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీని తర్వాత ప్రవచన మండపంలో జరిగేటువంటి ధర్మ చార్య సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. అయితే ఇప్పటికే రామానుజాచార్యుల 114 యాగశాలలో 1035 హోమగుండంలో ఘనంగా హోమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రతువును చూడడానికి ఇప్పటికే చాలా మంది ప్రముఖులు, రాజకీయ సినీ విశ్లేషకులు, వ్యాపార వాణిజ్య రంగాలకు చెందిన టువంటి ప్రముఖ వ్యాపార వేత్తలు దర్శించుకుంటున్నారు.