పిచ్చి పీక్స్ అంటే ఇదేనేమో.. చిప్స్ ప్యాకెట్ తో ఏం చేసిందంటే?
ఇలా ఇప్పటికే మనం రోజూ వాడే వస్తువుల తో కాస్త కొత్తగా ట్రై చేసి ఫ్యాషన్ టచ్ ఇచ్చినా ఎన్నో వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇక ఇప్పుడు ఇలాంటిదే జరిగింది. సాధారణంగా చిప్స్ అందరం తింటూ ఉంటారు. తిన్న తర్వాత ప్యాకెట్ డస్ట్ బిన్లో పడేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం డస్ట్ బిన్లో పడేయ లేదు ఆ మహిళ. చిప్స్ ప్యాకెట్ తో చీర తయారుచేసింది. ఎప్పుడు రకరకాల ఫ్యాషన్ దుస్తులు వేసుకుంటూ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది ఆ యువతి.
ఇప్పుడూ చిప్స్ ప్యాకెట్ తో చీర తయారుచేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇలా ఓ మహిళ చిప్స్ ప్యాకెట్ తయారు చేసిన వాటిని ధరించి నడుస్తున్న ఒక వీడియోని ఓ వ్యక్తి సెల్ ఫోన్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారిపోయింది. ఇక ఇదంతా చూసిన తర్వాత వారు ఐడియా బాగుంది అంటూ కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. వినాశకాలే విపరీత బుద్ధి అంటూ మరి కొంతమంది అంటున్నారు. ఏదేమైనా ఈ చిప్స్ ప్యాకెట్ చీర మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.