గోవా ఎన్నికల్లో దారుణం.. ఆ అభ్యర్థులే లేరంట..!

MOHAN BABU
ప్రస్తుతం రాజకీయాల పండగ  నడుస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు మహిళలకు ఎందుకు ప్రాతినిధ్యం కల్పించడం లేదు? సగానికిపైగా మహిళా ఓటర్లు ఉన్నా  అభ్యర్థిత్వానికి మాత్రం ఎందుకు వెనుకంజ వేస్తున్నారు? గోవాలో ఫిబ్రవరి  14 న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే రాష్ట్రంలో ఓటర్లు సగానికిపైగా మహిళలే ఉన్నప్పటికీ ప్రధాన పార్టీలు  సగటున కనీసం 8 శాతం స్థానాలు కూడా కేటాయించక పోవడం గమనార్హం. ప్రజా రంగంలో నేతలంతా మహిళా సాధికారత గురించి గొప్పగా స్పీచ్ లు మాత్రం ఇస్తున్నారు. కానీ ఎన్నికల్లో పోటీకి తగిన ప్రాధాన్యత కల్పించలేకపోయారు.


ఆకాశంలో సగమంటూ వేదికలపై మహిళలను ఆకాశానికి ఎత్తేస్తూ,ఎన్నికల్లో పోటీకి మాత్రం ప్రత్యేక స్థానాన్ని కల్పించలేకపోతున్నారు.గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తాజా రాజకీయ చిత్రమే ఇందుకు నిదర్శనం. గోవాలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.  అన్ని పార్టీల నుంచి ప్రముఖ నేతలు మహిళల ఓట్లే లక్ష్యంగా హోరేత్తిస్తున్నాయి. నేతలంతా మహిళా సాధికారత గురించి గొప్పగా ఉపన్యాసాలు ఇస్తున్నారు తప్ప ఎన్నికల్లో పోటీకి మాత్రం వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించ లేకపోతున్నారు. ఓ మహిళా నేతృత్వం వహిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పోటీకి నిలిపిన అభ్యర్థుల్లో 15 శాతం మహిళలకు కేటాయించగా ఇదే ప్రధాన పార్టీలో అత్యధిక మహిళా ప్రాతినిధ్యం గోవాలోని మొత్తం ఓటర్లలో పురుషులకంటే మహిళల సంఖ్య 31,465. 40 అసెంబ్లీ అసెంబ్లీ స్థానాలున్న గోవాలో అత్యధికంగా తృణమూల్ కాంగ్రెస్ నలుగురు మహిళలకు పోటీకి అవకాశం కల్పించగా, ఎన్సీపీ శివసేన కూటమి ఒక్కరికి చోటివ్వలేదు.


బిజెపి, ఆప్ లో ముగ్గురికి చొప్పున, కాంగ్రెస్ ఇద్దరికీ టికెట్స్ కేటాయించింది. గోవాలో గత ఎన్నికల్లోనూ మహిళలకు కల్పించిన ప్రాతినిధ్యం అంతంత మాత్రమే.లింగ సమానత్వం అంటూ పాలకులు అందమైన హామీలు ఇవ్వడం తప్ప చట్టసభల్లో మహిళలను ప్రోత్సహించాలన్న చిత్తశుద్ధి రాజకీయ పార్టీలో కనిపించడం లేదు. గోవాలో అత్యధిక సంఖ్యలో ఓటర్లుగా ఉన్న మహిళలే,అయినప్పటికీ నేతలెవ్వరికి మహిళలకు సీట్లు ఇవ్వాలనే యోచన ఎందుకు రావడం లేదన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: