కమలం రక్షకుడు కేసీఆర్?
రాష్ట్రంలో కేసీఆర్ కోసం బీజేపీ పనిచేస్తుందని, అలాగే దేశంలో బీజేపీ కోసం కేసీఆర్ పనిచేస్తున్నారని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో ఏ మాత్రం బలం లేని బీజేపీని, కేసీఆర్ టార్గెట్ చేసి...ఆ పార్టీని మరింత బలపర్చడానికి చూస్తున్నారని అంటున్నారు. అంటే బీజేపీనే టార్గెట్ చేయడం వల్ల ప్రజలు కూడా బీజేపీనే చూస్తారని, కాంగ్రెస్‌ని పట్టించుకోరని, ఆ ప్లాన్‌తోనే బీజేపీని పెద్దగా చేయడం కోసం కేసీఆర్ ట్రై చేస్తున్నారని, బీజేపీ బలం పెరిగితే...కాంగ్రెస్ ఓట్లు చీలుస్తుందని, అప్పుడు మళ్ళీ అధికారంలోకి రావొచ్చు అనేది కేసీఆర్ ప్లాన్ అని అంటున్నారు.
అలాగే దేశ రాజకీయాల్లో కూడా బీజేపీ వ్యతిరేక పార్టీలని ఏకం చేసి థర్డ్ ఫ్రంట్ పేరిట రాజకీయం చేయాలని కేసీఆర్ చూస్తున్న విషయం తెలిసిందే. అయితే అది బీజేపీకి వ్యతిరేకంగా కాదని, బీజేపీకి అనుకూలంగా అని, వ్యతిరేక పార్టీలని కలపడం వల్ల...బీజేపీ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్‌కు వెళ్లకుండా చేసి..అక్కడ కూడా ఓట్లు చీల్చి, మోదీకి లబ్ది చేకూర్చాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్, కమ్యూనిస్టులు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.
కేసీఆర్ కుట్ర తెలిసే..ప్రతిపక్షాలు ఆయనతో చేతులు కలపడం లేదని అంటున్నారు. దేశ స్థాయిలో బీజేపీ వ్యతిరేక ఓట్లను విభజించే వ్యూహంతో కేసీఆర్ ఉన్నారని, అందుకే దేశంలోని ప్రతిపక్ష పార్టీలని కలుస్తున్నారని, అంటే ఇక్కడ మోదీని వ్యతిరేకించినట్లే ఉండాలని, అదే సమయంలో మోదీకి పరోక్షంగా లాభం వచ్చేలా చేయడం కేసీఆర్ లక్ష్యమని కమ్యూనిస్టులు అంటున్నారు...అంటే కేసీఆర్ కమలం రక్షకుడు అని చెబుతున్నారు..అందుకే ప్రతిపక్షాలు కేసీఆర్‌ని నమ్మే పరిస్తితిలో లేవని తెలుస్తోంది.