కేసిఆర్ సారూ.. ఎందుకిలా చేశారూ?
ఇలాంటివి ఒక ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం ఊహించని జరిగింది. సాధారణంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై విమర్శలు చేయడం చూశాం. ఎన్ని విమర్శలు చేసినా దేశ ప్రధాన మంత్రిగా కొనసాగుతున్న ఒక వ్యక్తి రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలో పార్టీలకు అతీతంగా కెసిఆర్ ఆహ్వానించాల్సి ఉంటుంది. ఇటీవలే హైదరాబాద్ లోని పటాన్చెరు ఇక్రిశాట్ సంస్థ యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్త లోగో ని ఆవిష్కరించేందుకు అంతేకాకుండా రామానుజ విగ్రహాన్ని ప్రారంభించేందుకు హైదరాబాద్ పర్యటనకు వచ్చారు ప్రధానమంత్రి మోడీ.
కాగా పర్యటనకు ముందు నుంచే కేసీఆర్ నరేంద్ర మోడీని ఆహ్వానించడం లేదు వేరొకరిని పంపిస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి. కాని ఆ తర్వాత సీఎం కార్యాలయం స్పందించి కేసీఆర్ స్వయంగా వెళ్తున్నారంటు చెప్పింది. కానీ ఇప్పుడు చివరి నిమిషంలో అస్వస్థతతో కెసిఆర్ వెళ్లడం లేదు అంటూ మరోసారి ప్రకటించి షాక్ ఇచ్చాయి. అయితే కేసీఆర్ మోడీ నీ ఆహ్వానించేందుకు వెళ్లకపోవడం పై అటు ప్రతిపక్షాలు మాత్రం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . కెసిఆర్ అస్వస్థత కారణంగా కాదు ఉద్దేశపూర్వకంగానే మోడీని ఆహ్వానించడానికి వెళ్లకుండా అవమానించారంటూ తెలంగాణ బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిజంగానే కెసిఆర్ కు అస్వస్థత ఉంది అంటూ టిఆర్ఎస్ నేతలు అంటూ చెబుతూ ఉండటం గమనార్హం. ఇక కెసిఆర్ గైర్హాజరు మాత్రం బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఉన్న రాజకీయ వేడిని మరింత పెంచింది అని చెప్పాలి.