పవన్‌తో బాలయ్యకు నో యూజ్?

M N Amaleswara rao
పవన్ కల్యాణ్‌ని కలుపుకుంటేనే తమకు బెనిఫిట్ అవుతుందని చాలామంది టీడీపీ నేతలు భావిస్తున్న విషయం తెలిసిందే. ఒకవేళ పవన్ కల్యాణ్ గాని విడిగా పోటీ చేస్తే ఎక్కువ నష్టపోతామని గత ఎన్నికల్లోనే రుజువైన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. జనసేన సెపరేట్‌గా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి, టీడీపీ చాలా నియోజకవర్గాల్లో ఓటమి పాలైంది..అయితే ఈ సారి మాత్రం ఆ పరిస్తితి రాకుండా చూసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఎలాగైనా పవన్‌తో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్న విషయం తెలిసిందే.

ఇక పొత్తు వల్ల తమకు లాభం జరుగుతుందని ఉభయ గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాల టీడీపీ నేతలు అనుకుంటున్నారు...పవన్ సపోర్ట్ ఇస్తే ఈజీగా గెలుస్తామని అనుకుంటున్నారు. టీడీపీ నేతలు అనుకున్న దానిలో నిజముందనే చెప్పుకోవచ్చు...జనసేన కలిస్తే చాలామంది టీడీపీ నేతలు గట్టెక్కగలరు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన వల్ల టీడీపీకి లాభం జరగకపోవచ్చు. ఎందుకంటే జనసేన ప్రభావం రాష్ట్రమంతా లేదనే సంగతి తెలిసిందే.

ఉదాహరణకు చూసుకుంటే బాలయ్య బాబుకు పవన్ అవసరం అసలు లేదు..ఎందుకో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు. మామూలుగానే రాయలసీమ జిల్లాల్లో జనసేనకు బలం లేదు...కనీసం 10 వేల ఓట్లు తెచ్చుకునే కెపాసిటీ ఆ పార్టీకి కనిపించడం లేదు. ఇక బాలయ్య ప్రాతినిధ్యం వహించే హిందూపురం అసెంబ్లీలో జనసేన బలం చాలా పరిమితం. ఇక్కడ టీడీపీదే ఆధిక్యం అనే సంగతి అందరికీ తెలిసిందే.

మొదట నుంచి ఇక్కడ టీడీపీ హవా కొనసాగుతూనే ఉంది..ఇక టీడీపీ తర్వాత వైసీపీకి బలం ఉంది. రెండో స్థానం వైసీపీదే. అయితే హిందూపురంలో జనసేన బలం చాలా తక్కువ...గత ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 4 వేల ఓట్లు మాత్రమే పడ్డాయి..కానీ బాలయ్య మెజారిటీ 18 వేలు.. కాబట్టి జనసేన ఓట్లు వల్ల బాలయ్యకు యూజ్ లేదు. పవన్ సపోర్ట్ ఉన్నా లేకపోయినా బాలయ్యకు ఒరిగేది ఏమి లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: