సైలెంట్‌గా ‘సైకిల్’ నడిపించేస్తున్నారు!
జిల్లాల విభజన అనేది మంచి విషయమే...కానీ సమయం సందర్భం లేకుండా విభజన చేశారు..అలాగే విభజనతో ఒక ప్రాంతానికి న్యాయం...మరొక ప్రాంతానికి అన్యాయం అన్నట్లు పరిస్తితి ఉంది. పైగా జిల్లాల పేర్లు ఒకటి వివాదం. అలాగే జిల్లాల కేంద్రాల విషయంలో రచ్చ నడుస్తోంది. ప్రజలు ఈ విభజనపై ఆందోళన చేస్తున్నారు. ఇలా అన్నిరకాలుగా రాష్ట్రంలో రచ్చ నడుస్తోంది. అయితే జిల్లాల విభజన విషయంలో గాని, ఉద్యోగుల ఆందోళన విషయంలో ప్రతిపక్ష టీడీపీ ఎక్కువ జోక్యం చేసుకోలేదు. మద్ధతు అయితే ఇచ్చింది గాని ప్రత్యేకంగా ఆ సమస్యలని భుజాన వేసుకోలేదు. జిల్లాల విషయంలో అన్నీ పార్టీలతో కలిసి టీడీపీ నేతలు కూడా తమ ప్రాంతాలకు సంబంధించి న్యాయం కోసం పోరాడుతున్నారు.
అయితే ఇలా రాష్ట్రంలో ఎక్కడకక్కడే రచ్చ జరుగుతుంది...కానీ కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు సైలెంట్‌గా పనిచేసుకుంటున్నారు. టీడీపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా వారు ముందుకెళుతున్నారు...సైలెంట్‌గా గ్రామాల్లో పర్యటిస్తూ...ప్రజల మద్ధతు పెంచుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల ఏమో ఏం చేయాలో తెలియక సైలెంట్‌గా ఉన్నారు..దీంతో టీడీపీ నేతలు సైలెంట్‌గా తమ పనులని చక్కబెట్టుకుంటున్నారు. నియోజకవర్గాల్లో బలం పెంచుకుని, నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు పలు కార్యక్రమాలతో నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. ఇలా టీడీపీ నేతలు సైలెంట్‌గా సైకిల్‌ని నిలబెట్టే కార్యక్రమాలు చేసేస్తున్నారు.