పీఆర్సీ సమస్య: తగ్గేదేలే అంటున్న కమిటీ... ?
ఇప్పటికే ఉద్యోగ సంఘాలకు అండగా వైసీపీ వ్యతిరేక పార్టీలు అన్నీ గొంతు కలుపుతున్నాయి. ఇది జగన్ కు పెద్ద తలనొప్పిగా మారింది. సచివాలయంలోని ఉద్యోగులు కూడా పెన్ డౌన్ ను కొనసాగిస్తునారు. ఏ ఒక్కరూ కూడా తమ పనులకు హాజరు కాకుండా ఆందోళన చేపట్టారు. దీనితో ప్రభుత్వం కార్యకలాపాలు అన్నీ ఆగిపోయాయి. ఇంకాసేపట్లో పీఆర్సీ కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో చర్చించే విషయాలను బట్టి ఆందోళన తీవ్రం కానుందా లేదా ప్రభుత్వంతో కూర్చుని మాట్లాడుతుందా అన్న వివరాలు తెలియనున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే ప్రభుత్వం తరపున సీఎస్ చెప్పిన ప్రకారం వారితో సానుకూలంగా మాట్లాడుతారు.
ఇది కనుక ఫెయిల్ అయితే ముందు గానే చెప్పిన ప్రకారం ఫిబ్రవరి 7 నుండి అంటే సోమవారం నుండి సమ్మెను ఉదృతం చేయాలని అనుకుంటున్నారు. ఇలా ఆందోళనలు, సమ్మెలు, ధర్నాలు చేసి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే ఉద్యోగ సంఘాలు ఫుల్ జోష్ లో ఉన్నాయని చెప్పాలి. మరి రాష్ట్ర భవిష్యత్తు ఏమిటో అర్ధం కావడం లేదు. జగన్ తర్వాత ఏమి స్టెప్ తీసుకోనున్నారు అనేది తెలియాల్సి ఉంది.