భారత్ కొత్త ప్లాన్.. ఆపరేషన్ స్నో లియోపార్డ్?
సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులకు సృష్టించేందుకు చైనా ప్రయత్నించినా సమయం లోనే భారత సైనికులు వ్యూహాత్మకం గా వ్యవహరించి చైనా అధీనం లో ఉన్న కొండా ప్రాంతాల లో తమ ఆధీనం లోకి తెచ్చుకున్నారు.. ఇక మరోవైపు చైనా పై ఆర్థిక యుద్ధం కూడా చేస్తూ అన్ని రకాల నిషేధిస్తూ వచ్చింది భారత్. ఇకపోతే అటు సరిహద్దుల్లో గడ్డ కట్టుకు పోయే చలిలో కూడా భారత సైనికులు పహారా కాస్తే.. చైనా సైనికులు మాత్రం చలికి తట్టు కోలేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
ఈ క్రమం లోనే ఎప్పటికప్పుడు చైనా సరిహద్దుల్లో కొత్త సైనికులను రప్పిస్తూనే ఉంది చైనా. ఇలాంటి సమయం లో అటు భారత్ సరిహద్దుల్లో సరి కొత్త వ్యూహానికి తెర లేపారు అన్నది తెలుస్తుంది. ఆపరేషన్ స్లో లియోపార్డ్ సరిహద్దుల్లో భారత సైన్యం అమలు చేస్తోంది. ఇలా ఆయా వాతావరణ పరిస్థితుల్లో కలిసి పోతు కనీసం అక్కడ ఉన్నట్లు కూడా తెలియ కుండా సైనికులు గస్తీ కాస్తూ అంటారు. ఇక ఎవరైనా శత్రువులు వస్తే ఎంతో పకడ్బందీగా దాడి చేస్తూ ఉంటారు. ఇలా భారత్ ప్రారంభించిన కొత్త వ్యూహంచైనా కు షాక్ ఇవ్వడం పక్క అని అంటున్నారు విశ్లేషకులు.