పరస్పర బదిలీల జీవో 21ని సవరించాలి ?

Veldandi Saikiran
పరస్పర బదిలీల జీవో 21ని సవరించాలి - టిఎస్ యుటిఎఫ్
పరస్పర బదిలీ అభ్యర్థులలో కనీసం ఒక్కరైనా పిఓ - 2018 ప్రకారం బదిలీ అయి ఉండాలని నిబంధన విధించడం సరికాదు. వేర్వేరు పూర్వ జిల్లాల్లో నియామకం అయిన ఉపాధ్యాయులు వారి కుటుంబ అవసరాల కోసం పరస్పర బదిలీల ద్వారా ఇతర జిల్లాలకు వెళ్ళాలని 2012 నుండి అంతర్జిల్లా బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు.  ఈ నిబంధన కారణంగా వారికి పరస్పర బదిలీకి అవకాశం దక్కకుండా పోయింది. అదేవిధంగా ఉమ్మడి లోకల్ క్యాడర్( జిల్లా / జోన్) లో నియామకమైన ఉద్యోగులు ఉమ్మడి లోకల్ క్యాడర్(జిల్లా/ జోనల్) సీనియారిటీ ప్రకారం అదే లోకల్ క్యాడర్( జిల్లా/జోనల్) పరిధిలో వేరు వేరు నూతన లోకల్ క్యాడర్ల (జిల్లాలు/జోన్లు)కు అలొకేట్ చేయబడిన వారు పరస్పర బదిలీల్లో పూర్వపు లోకల్ క్యాడర్ (జిల్లా/ జోనల్) పరిధిలోనే పరస్పర బదిలీ కోరుకుంటే సీనియార్టీలో చివరి ర్యాంకు తీసుకోవాలని నిబంధన విధించడం కూడా సరైంది కాదు. వేర్వేరు పూర్వపు యూనిట్లలో నియామకమై, వేర్వేరు నూతన యూనిట్లకు బదిలీ అయిన వారికి మాత్రమే ఆ నిబంధన వర్తింపజేయాలి.  ఒకే పూర్వపు యూనిట్లో నియామకమై అదే పూర్వపు యూనిట్ పరిధిలోని నూతన యూనిట్ కు బదిలీ అయిన వారికి సీనియార్టీ మొత్తం లెక్కించాలి.


317 జిఓ పైన, ఉద్యోగుల ఉద్యమం పైన రాష్ట్ర ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉద్యోగులు అందరినీ మౌఖిక ఆదేశాలతో కొత్త పోస్టుల్లో చేరేటట్లు వత్తిడి తెచ్చి చేర్పించారు.అలొకేషన్ లో అన్యాయం జరిగిందన్నా ముందుగా కొత్త లోకల్ క్యాడర్ లో రిపోర్ట్ చేసిన తరువాతనే అప్పీల్ చేసుకోవాలని షరతు విధించారు.  ఇప్పుడేమో అందరూ చేరిపోయారంటూ తప్పుడు ప్రచారం చేయటాన్ని యుయస్పీసీ తీవ్రంగా ఖండిస్తున్నది.
జిఓ 317 ద్వారా నష్టపోయినవారందరికీ న్యాయం జరిగే వరకూ యుయస్పీసీ పోరాటం కొనసాగుతుంది ఈ నెల 5న ప్రధానమంత్రి పర్యటన ఉన్నందున భద్రతా కారణాలు, ట్రాఫిక్ ఆంక్షలు, మీడియా కవరేజి తదితర సమస్యలు ఉన్నందున మహా ధర్నాను ఫిబ్రవరి 9కి వాయిదా వేయాలని నిర్ణయించిన ఉపద్యాయ సంఘాల పోరాట కమిటీ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: